365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూన్ 30,2023: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తోపాటు ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ “BRO సినిమా”తో భారీ సందడి చేయబోతున్నారు. తమిళంలో వచ్చిన “వినోదయ సితం” చిత్రాన్ని సముద్రఖని దర్శకత్వంలో తెలుగులో “BRO సినిమా”పేరుతో తెరకెక్కిస్తున్నారు.

ఐతే “BRO సినిమా” టీజర్ ను విడుదల చేయడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తన మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోరూపాన్ని చూపించారు. సాయి ధరమ్ తేజ్‌తో అతని బంధం చూడటానికి చాలా ఉల్లాసంగా ఉంటుంది. BRO టీజర్ సినిమా కంటెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమవుతుంది. ఎస్ ఎస్ తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.

BRO జూలై 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్ రాశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ జీ స్టూడియోస్ నిర్మాతలు. సినిమాలోని సాయిధరమ్ తేజ్ కు సంబంధించిన చివరి పాటను విదేశాల్లో చిత్రీకరించారు.