Mon. Dec 23rd, 2024
BRS_MPs

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ, జనవరి31, 2023: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తెలంగాణ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారు ఎంపీలు. ఈసందర్భంగా రాజ్యసభ సభ్యులు రవిచంద్ర బీఆర్ఎస్ పార్లమెంటరీ నేతలు కేశవరావు, నాగేశ్వరరావు తదితర ఎంపీలతో కలిసి పాల్గొన్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని బీఆర్ఎస్,ఆప్ పార్లమెంటు సభ్యులు బహిష్కరించారు.పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను రాష్ట్రపతి మంగళవారం ప్రారంభిస్తూ ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తెలంగాణ రాష్ట్ర వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు మార్గ నిర్దేశనంలో ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారు.

కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక, రైతు,మహిళ,యువజన వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నదని బీఆర్ఎస్ తో పాటు ఆప్ ఎంపీలు విలేకరులతో మాట్లాడుతూ నిశితంగా విమర్శించారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ పార్లమెంటరీ నేతలు కే.కేశవరావు, నామా నాగేశ్వరరావు, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, బండి పార్థసారథి రెడ్డి తదితరులతో కలిసి పాల్గొన్నారు.

error: Content is protected !!