Wed. Jan 15th, 2025
Mp-vaddiraju-ravichandra_3665

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఖమ్మం, మార్చి 8,2023: ఖమ్మం జిల్లాలోని 10కి 10అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ గెల్చుకోవడం ఖాయం అని ఎంపీ రవిచంద్ర అన్నారు. ఆయన మంగళవారం పార్థసారథి రెడ్డి స్వగ్రామం కందుకూరులో జరిగిన ఎడ్ల పందేల పోటీలకు వెంకటవీరయ్య, మధులతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగుతున్నామని,వచ్చే ఎన్నికలలో జిల్లాలోని 10కి 10 అసెంబ్లీ సీట్లలో బీఆర్ఎస్ అఖండ మెజారిటీతో గెలవడం, కేసీఆర్ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించడం తథ్యమని ఎంపీ రవిచంద్ర ధీమాగా చెప్పారు.

వద్దిరాజు,తాతా,సండ్రలు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించి ఎంపీ బండి అందజేసిన వైద్య పరికరాలు,7 అంగన్ వాడీలకు ఇచ్చిన ఆట వస్తువులను పరిశీలించారు.ఎడ్ల పందేలు,కబడ్డీ పోటీలలో విజేతలైన వారికి అతిథులు బహుమతులు ప్రదానం చేశారు.

Mp-vaddiraju-ravichandra_3665

ఒంగోలు జాతి గిత్తలు ప్రపంచంలోనే ప్రసిద్ధమైనవని,అరుదైన వీటి పరిరక్షణకు ఖమ్మంలో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకు విజ్ఞప్తి చేస్తానని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.

రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి స్వగ్రామం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కందుకూరులో పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎడ్లు బండ లాగడం,కబడ్డీ పోటీలు జరిగాయి.

Mp-vaddiraju-ravichandra_3665

పార్థసారథి రెడ్డి సహకారంతో స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో ఈ పోటీలు ఘనంగా జరిగాయి. అంతకుముందు సత్తుపల్లి నుంచి వందలాది కార్లు ద్విచక్ర వాహనాలు వెంట రాగా పార్థసారథి రెడ్డి, రవిచంద్ర,వెంకట వీరయ్య,మధులు కందుకూరు చేరుకున్నారు.
ఈ సందర్భంగా అతిథులకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు.

error: Content is protected !!