Fri. Dec 13th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ, డిసెంబర్ 13,2024: ఓబీసీల ఓట్లు మాత్రమే కావాలని, వారికి రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఓబీసీల హక్కుల కోసం నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశ జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న ఓబీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని, చట్టసభల్లో ఓబీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కేసీఆర్‌ పాలనలో ఓబీసీలకు సముచిత స్థానం లభించిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మాత్రం ఓబీసీలను విస్మరిస్తున్నారని ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

ఓబీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు డిమాండ్
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కోరిక
చట్టసభల్లో ఓబీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కోరుతూ ఆందోళన
తెలంగాణలో కేసీఆర్‌ పాలనలో ఓబీసీలకు సముచిత స్థానం లభించిందని వ్యాఖ్య
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓబీసీలను విస్మరిస్తుందని ఆరోపణ

కేసీఆర్ బీసీలు,రైతులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీల పక్షపాతి అని,ఆయన హయాంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని ఆయన వివరించారు.రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో బీసీలు ఇద్దరు మాత్రమే ఉన్నారని,ఖాళీగా ఉన్న 6 స్థానాల భర్తీ సందర్భంగా తమకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని ఆయన కోరారు.దేశవ్యాప్తంగా కులగణనను వెంటనే చేపట్టి పార్లమెంటులో ఓబీసీ బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా చట్టసభల్లో తమకు 33%రిజర్వేషన్స్ కల్పిస్తూ మహిళలతో పాటు అమలుపర్చాలని ప్రధాని మోడీని ఎంపీ రవిచంద్ర డిమాండ్ చేశారు.రాజ్యాధికారంలో తమ ఓబీసీలకు న్యాయమైన వాటా దక్కే వరకు బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా గొంతెత్తి నినదిస్తూనే ఉంటుందని ఎంపీ వద్దిరాజు స్పష్టం చేశారు.


ఈ కార్యక్రమంలో ఓబీసీ నాయకులు సిద్ధేశ్వర్,కిరణ్,వేల్పుల శ్రీనివాస్,పర్వతం సతీష్, అరుణ,చామకూరి రాజు,డీ.వేలాద్రి,కే.వీ.గౌడ్ తదితరులతో కలిసి వందలాది మంది పాల్గొన్నారు.
“జై బీసీ జైజై బీసీ”,”ఏర్పాటు చేయాలి, కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి”,”చేపట్టాలి చేపట్టాలి కులగణనను దేశవ్యాప్తంగా వెంటనే చేపట్టాలి”,”ప్రవేశపెట్టాలి ప్రవేశపెట్టాలి పార్లమెంటులో ఓబీసీ రిజర్వేషన్స్ బిల్లును ప్రవేశపెట్టాలి”,”వర్థిల్లాల్లి వర్థిల్లాల్లి ఓబీసీల ఐక్యత వర్ధిల్లాలి”,”పోరాడుదాం పోరాడుదాం న్యాయమైన హక్కుల సాధనకు, వాటా దక్కించుకునేందుకు పోరాడుదాం”అనే నినాదాలతో జంతర్ మంతర్ పరిసరాలు దద్దరిల్లాయి.

error: Content is protected !!