365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూలై 31, 2025: బ్రిటిష్ మోటార్‌సైకిల్ దిగ్గజం బీఎస్ఏ (BSA) మరోసారి తన ఇంజనీరింగ్ ప్రతిభను పరిచయం చేసింది. సంస్థ తన తాజా మోడళ్లు స్క్రాంబ్లర్ 650 , బాంటమ్ 350 ను గ్లోబల్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఆవిష్కరణ సంస్థలో ఓ ముఖ్యమైన మైలురాయి కావడం విశేషం. క్లాసిక్ బ్రిటిష్ డిజైన్‌ను ఆధునిక సాంకేతికతతో మేళవించి బీఎస్ఏ ఈ రెండు మోడళ్లను రూపకల్పన చేసింది.
స్క్రాంబ్లర్ 650 – సాహసయాత్రలకు సరైనది

652 సీసీ సామర్థ్యంతో వచ్చిన ఈ బైక్ 45PS పవర్, 55Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్, బ్రెంబో బ్రేక్స్, పిరెల్లి టైర్లు, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వంటి అధునాతన ఫీచర్లతో డిజైన్ చేయనుంది. 12 లీటర్ల ఇంధన ట్యాంక్, 218 కిలోల బరువు కలిగి ఉండటం వలన దీర్ఘ ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. థండర్ గ్రే, రావెన్ బ్లాక్, విక్టర్ యెల్లో రంగులలో లభిస్తుంది.
ఇది కూడా చదవండి…23 కోట్ల (230 మిలియన్) పెట్టుబడిదారుల మైలురాయిని అధిగమించిన NSE..
బాంటమ్ 350 – పాత కాలపు స్టైల్‌కు నూతన రూపం
ప్రముఖ క్లాసిక్ మోడల్ అయిన బాంటమ్ ఇప్పుడు ఆధునిక అవతారంలో వచ్చింది. 334 సీసీ ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి ఉన్న ఈ బైక్ 29PS పవర్, 29.62Nm టార్క్‌ను అందిస్తుంది. 800mm సీటింగ్ హైట్‌తో ప్రతి వయసు రైడర్‌కు సరిపోయేలా రూపొందించారు. రౌండ్ హెడ్‌లైట్, టియర్‌డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ ఆకట్టుకుంటుంది. పలు ఆకర్షణీయ రంగుల్లో అందుబాటులో ఉంది.
‘‘ఇది కేవలం బైక్ కాదు… ఒక ఉద్యమం’’
ఈ సందర్భంగా క్లాసిక్ లెజెండ్స్ సహ వ్యవస్థాపకుడు అనుపమ్ తరేజా మాట్లాడుతూ, ‘‘బీఎస్ఏ స్క్రాంబ్లర్ 650 రైడర్ల adventurous ఆత్మను ప్రతిబింబిస్తుంది. అలాగే బాంటమ్ 350 రాబోయే తరం మోటార్‌సైక్లింగ్‌కు ఓ స్ఫూర్తిదాయక ప్రారంభం అవుతుంది’’ అన్నారు.