365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్,సెప్టెంబర్ 23, 2021: బీఎస్‌హెచ్ హోమ్ అప్లయెన్సెస్ బహు భాషా సేవా కేంద్రాన్ని చెన్నైలోప్రారంభించింది. దక్షిణ భారతదేశంలో వినియోగదారులకు అత్యుత్తమంగా సేవలను అందించే లక్ష్యంతో దీనిని ఏర్పాటుచేశారు. ఇది భారతదేశంలో బీఎస్‌హెచ్ రెండవ బహుభాషా కేంద్రం వినియోగదారులకు తమిళ, మలయాళం, తెలుగు, కన్నడ, ఇంగ్లీష్, హిందీ భాషలలో ఎంచుకునే అవకాశం అందిస్తుంది.
భారతదేశంలో అప్లయెన్సెస్ విభాగంలో ప్రత్యేకంగా, ఉత్పత్తులను వినియోగించడం ద్వారా తాము పొందిన అనుభవాల ఆధారంగా వినియోగదారుల సందేహాలకు తగిన సమాధానాలను ఉద్యోగులు అందించే రీతిలో ఈ కేంద్రంలో ప్రత్యక్షంగా ఉపకరణాలు సైతం అందుబాటులో ఉన్నాయి. ఈ సేవా కేంద్రం ప్రారంభం సందర్భంగా నీరజ్ బహల్ , ఎండీ అండ్ సీఈవొ, బీఎస్‌హెచ్ హోమ్ అప్లయెన్సన్ మాట్లాడుతూ ‘‘ మా రెండవ బహు భాషా సేవా కేంద్రాన్ని చెన్నైలో ప్రారంభించడం పట్ల మేము చాలా ఆనందంగాఉన్నాము. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యం.
ఈ కేంద్రం ద్వారా, వినియోగదారులందరూ కూడా పూర్తి సౌకర్యవంతంగా తమ సందేహాలకు తగిన సమాధానాలను పొందగలరని భరోసా కల్పించడం మా లక్ష్యం. మా ముంబై కేంద్రంకు సానుకూల స్పందన లభించింది. మా చెన్నై కేంద్రం నుంచి కూడా అదే తరహా స్పందనను ఆశిస్తున్నాము. బీఎస్‌హెచ్ హోమ్ అప్లయెన్సస్ వద్ద మాకు అతి ముఖ్యమైన మార్కెట్‌గా చెన్నై కొనసాగుతుంది’’ అని అన్నారు.
మొట్టమొదటి బహుభాషా సేవా కేంద్రాన్ని మహారాష్ట్రలోని ముంబైలో 2011లో ప్రారంభించారు. అక్కడ ప్రతి నెలా 1.5మిలియన్ కనెక్ట్స్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రం ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, గుజరాతీ భాషలలో సేవలను అందిస్తుంది.