Sat. Dec 21st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 6,2024:భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దాని వినియోగదారుల కోసం అనేక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు అందుబాటులోకి తీసుకువచ్చింది.సంస్థ FTTH (ఫైబర్-టు-ది-హోమ్) సేవ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంది. BSNL భారత్ ఫైబర్ 25 Mbps నుంచి 300 Mbps వరకు వేగాన్ని అందించే ప్లాన్‌లను కలిగి ఉంది.

కానీ 300 Mbps కంటే ఎక్కువ వేగాన్ని అందించే ప్లాన్‌లు లేవు. ప్రస్తుతం BSNL నుంచి అత్యంత ఖరీదైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు తీసుకు వస్తుంది అవి ఏవో ఇప్ప్పుడు చూద్దాం. ఈ ప్లాన్ 6 TB కంటే ఎక్కువ నెలవారీ డేటాతో వస్తుంది. ఈ ప్లాన్ ప్రయోజనాలను వివరంగా తెలుసుకుందాం…

BSNL ఫైబర్ అల్ట్రా OTT కొత్త ప్లాన్: BSNL ఫైబర్ అల్ట్రా OTT అనేది ప్రస్తుతం ట్రేడింగ్ లో ఇది 300 Mbps ప్లాన్ ను కలిగి ఉన్నది. ప్లాన్ 6.5 TB వరకు నెలవారీ డేటాను అందిస్తుంది. FUP (ఫెయిర్ యూసేజ్ పాలసీ) డేటా వినియోగం తర్వాత వేగం 20 Mbpsకి పడిపోతుంది. ఈ ప్లాన్ OTT (ఓవర్-ది-టాప్) ప్రయోజనాలతో కూడా వస్తుంది.

Disney+ Hotstar, YuppTV, SonyLIV,ZEE5 OTT ప్రయోజనాలతో పాటు, Lionsgate Play, ShemarooMe, EpicON కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్‌కి నెలకు రూ. 1799 ఖర్చవుతుంది (అదనపు పన్ను వర్తిస్తుంది).

BSNL భారత్ ఫైబర్ కనెక్షన్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. వినియోగదారులు ఎటువంటి ఇన్‌స్టాలేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని గమనించాలి. BSNL ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకు (మార్చి 31, 2025) గృహాలు,కార్యాలయాలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లను ఉచితంగా ఇన్‌స్టాలేషన్‌ని ప్రకటించింది. BSNL భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల గురించి మరింత సమాచారం పొందాలనుకుంటే, మీరు ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

BSNL FTTH వినియోగదారుల కోసం కొత్త సాంకేతికతలు,సేవలను పరీక్షిస్తోంది. ఈ కొత్త సాంకేతికతలు,సేవలు సర్వత్ర BSNL Wi-Fi , IFTV (ఇంట్రానెట్ ఫైబర్ TV). ప్రస్తుతం తమిళనాడు, పుదుచ్చేరిలో ఈ సర్వీసులను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. వీటిని త్వరలో వాణిజ్య ప్రాతిపదికన దేశవ్యాప్తంగా విస్తరించాలని BSNL యోచిస్తోంది. ఇది BSNL FTTH సేవలను దాని ప్రైవేట్ పోటీదారుల నుంచి వేరు చేస్తుంది.

సర్వత్రా BSNL Wi-Fiతో, వినియోగదారులు ఇంటి వెలుపల BSNL ,Wi-Fi నెట్‌వర్క్‌ను ఉపయోగించవచ్చు .అదే వేగాన్ని పొందవచ్చు. కానీ వారి ప్లాన్ నుంచి డేటా తీసివేయనుంది. ఇది కాకుండా BSNL చాలా సంవత్సరాలుగా ఎయిర్ ఫైబర్ ప్లాన్‌లను అందిస్తోంది.

రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ తమ 5G FWA (ఫిక్స్‌డ్-వైర్‌లెస్ యాక్సెస్) సేవను ప్రారంభించకముందే ప్రభుత్వ రంగ టెల్కో ఈ సేవను అందించింది. BSNL ఎయిర్ ఫైబర్ కనెక్షన్ దేశంలోని అన్ని ప్రాంతాలలో ఉంది. అందుబాటులో ఉన్న ప్లాన్‌లు చాలా FUP (ఫెయిర్ యూసేజ్ పాలసీ) డేటాతో కస్టమర్ హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందిస్తాయి.

error: Content is protected !!