Sun. Dec 1st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 1,2024: భారతదేశంలో డిజిటల్ కనెక్టివిటీని పెంపొందించేందుకు BSNL కీలక అడుగు వేస్తోంది. దేశవ్యాప్తంగా 50,000 4G టవర్లను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని BSNL ప్రారంభించింది.

ఈ సమాచారాన్ని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 50,000 టవర్లలో 41,000 టవర్లు అక్టోబర్ 29 నాటికి పనిచేయడం ప్రారంభించాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. BSNL లక్ష స్థానాల్లో 4G టవర్ల ఏర్పాటు లక్ష్యాన్ని పునరుద్దరించేందుకు ఈ నూతన టవర్లు ఉపకరిస్తాయని ప్రభుత్వం తెలిపింది.

కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర్ పథకంలో భాగంగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నేతృత్వంలోని కన్సార్టియంతో కలిసి BSNL ఈ టవర్లను ఏర్పాటు చేయనుంది. 2023 నాటికి లక్ష టవర్లకు సంబంధించిన పరికరాలను రూ. 24,500 కోట్లతో సరఫరా చేసేందుకు టీసీఎస్‌కు కాంట్రాక్ట్ ఇచ్చింది. ఈ కన్సార్టియంలో సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్, ITI వంటి సంస్థలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి.

BSNL జూన్ 2025 నాటికి 1 లక్ష ప్రదేశాలలో 4G నెట్‌వర్క్‌ను ప్రారంభించడానికి కట్టుబడి ఉందని టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గతంలో ప్రకటించారు.

error: Content is protected !!