365తెలుగు డాట్ కామ్ ఆన్ ,న్యూస్,జూలై 25,2023: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్క వేణుగోపాల్ శ్రీలక్ష్మీనారాయణ అష్టోత్తరశత మహాయాగ కార్యక్రమానికి హాజరయ్యారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గ ఆరాంఘర్ చౌరస్తా వద్ద జరుగుతున్న108 అష్టోత్తర శతశ్రీ భాగవత మహాపురాణ పారాయణము, శ్రీ లక్ష్మీనారాయణ అష్టోత్తర శత మహాయాగ కార్యక్రమానికి శ్రీ ఓం ప్రకాష్ ఖండేవాల్ ఆహ్వానం మేరకు మహాయాగానికి హాజరై తీర్ధప్రసాదాలు స్వీకరించారు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్క వేణుగోపాల్.
ఈ మహాశాంతి యాగం సందర్భంగా రాజేంద్రనగర్ ప్రజలు సుఖ,సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్క వేణుగోపాల్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి మైలార్దేవ్ పల్లి బిజెపి సీనియర్ నాయకులు సంతోష్, శంషాబాద్ బీజేవైఎం అధ్యక్షులు-జూకల్ ఎంపీటీసీ బుక్క ప్రవీణ్ కుమార్, ఏర్పురం మహేష్ తోపాటు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.