
365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 7,2022 : జులై 5 వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించ నున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. వివిధ శాఖల అధికారులతో కళ్యాణం నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 వ తేదీన ఎదుర్కోళ్ళు, 5 వ తేదీన కళ్యాణం, 6 వ తేదీన రధోత్సవం నిర్వహించడం జరుగుతుందని వివరించా రు. అమ్మవారి కళ్యాణాన్ని భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా TV లలో చూసే లా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాలతో అమ్మవారి కళ్యాణం, బోనాలు, ఇతర అన్నివర్గాల పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి కల్యాణానికి నగరం నుండే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని పేర్కొన్నారు.

భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు
వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరుగు తుందని అన్నారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. పెద్ద సంఖ్యలో భక్తులు రావడాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి తోపులాటలకు అవకాశం లేకుండా పటిష్టమైన భారికేడ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. భారీ పోలీసు బందోబస్తు తో పాటు CC కెమెరాలను ఏర్పాటు చేసి శాంతిభద్రతల ను పర్యవేక్షించ నున్నట్లు చెప్పారు. ఆలయ పరిసరాలలో ఎక్కడ కూడా సీవరేజి లీకేజీ లు లేకుండా పర్య వేక్షించాలని వాటర్ వర్క్స్ అధికారులను మంత్రి ఆదేశించారు. రహదారుల మరమ్మతులు ఉంటే ఇప్పటినుండే చేపట్టాలని చెప్పారు. రధోత్సవం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా విద్యుత్ లైన్ లను సరిచేయడం, చెట్ల కొమ్మలను తొలగించడం చేపట్టాలని అన్నారు.

అమ్మవారి దర్శనం, కళ్యాణం కోసం ఇచ్చే పాస్ లను డూప్లికేషన్ కు ఆస్కారం లేకుండా బార్ కోడింగ్ తో కూడిన పాస్ లను జారీ చేయాలని ఆదేశించారు. కళ్యాణం, రధోత్సవం సందర్భంగా ఆలయం వైపు రహదారులను మూసివేసి వాహనాల మల్లింపుకు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్, పోలీసు అధికారులను ఆదేశించారు. దేవాలయ పరిసరాలలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 5 ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని DM&HO డాక్టర్ వెంకట్ ను మంత్రి ఆదేశించారు.
సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారులతో పలు కార్యక్రమాలు..

సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో కళాకారులతో భక్తులను ఆహ్లాద పరిచేలా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తుల సౌకర్యార్థం RTC ప్రత్యేక బస్సులను నడుపుతుందని చెప్పారు. ఆలయంలో ప్రభుత్వం, దాతల సహకారంతో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడ, జరిగిందని చెప్పారు. అమ్మవారి కళ్యాణం తర్వాత ఆలయ అభివృద్ధి కోసం సహకరించి న దాతలు, కళ్యాణం ఏర్పాట్లను పర్యవేక్షించిన వివిధ శాఖల అధికారులను సన్మానించడం ద్వారా గౌరవించుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, EO అన్నపూర్ణ, ఆలయ కమిటీ సభ్యులు, DM & HO డాక్టర్ వెంకట్,RTC RM వెంకన్న, వాటర్ వర్క్స్ డైరెక్టర్ ఆపరేషన్ కృష్ణ, CGM ప్రభు, సికింద్రా బాద్ RDO వసంత, జోనల్ కమిషనర్ రవి కిరణ్, అడిషనల్ ట్రాపిక్ DCP రంగారావు, పంజాగుట్ట ACP గణేష్, SR నగర్ ఇన్ స్పెక్టర్ సైదులు, R & B EE రవీంద్ర మోహన్, రీజనల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.