365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 22,2024: గత నెలన్నర కాలంగా స్టాక్ మార్కెట్‌లో కరెక్షన్ కనిపించింది. ఈ కరెక్షన్ వల్ల పెట్టుబడిదారులు బాగా నష్టాలను ఎదురుకున్నారు. మార్కెట్‌లో బేర్ పట్టు కొనసాగుతున్నప్పుడు, రెండు సూచీలు నిరంతరంగా దిగువ స్థాయిలను తాకాయి.
ఈ పరిణామాల మధ్య, పెట్టుబడిదారులు మార్కెట్‌లో బుల్ రన్ ప్రారంభం అవుతుందని ఆశించారు.
ఈ రోజు ట్రేడింగ్ సెషన్‌లో మార్కెట్‌లో క్షీణతకు బ్రేక్ పడింది. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌లో రెండు సూచీలు అద్భుతమైన లాభాలతో ముగిశాయి.
సెన్సెక్స్ 1,961.32 పాయింట్లు లేదా 2.54% లాభంతో 79,117.11 వద్ద ముగిసింది. నిఫ్టీ 557.40 పాయింట్లు లేదా 2.39% లాభంతో 23,907.30 వద్ద ముగిసింది.
బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.3%, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ దాదాపు 1% పెరిగాయి. రంగాల విషయానికి వస్తే, అన్ని రంగాల్లో వృద్ధి కనిపించింది. పీఎస్‌యూ బ్యాంక్స్, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఎనర్జీ, రియల్టీ రంగాలు 2-3% లాభంతో ముగిశాయి.
టాప్ గెయినర్స్:
నిఫ్టీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టీసీఎస్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్ షేర్లు లాభాలతో ముగిశాయి.
టాప్ లూజర్స్:
బజాజ్ ఆటో షేర్ మాత్రమే టాప్ లూజర్‌గా నిలిచింది.