365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,ఫిబ్రవరి 10,2022:లహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఫార్-రీచింగ్ పరిణామాన్ని చూపించే తన నిబద్ధతను పునరుశ్ఛరణ చేస్తూ, అగ్రగామి సామాజిక పరిణామాన్ని చూపించే కార్యక్రమం ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ (EFA) ప్రారంభించి ఏడాది పూర్తి చేసి కొత్త మైలు రాయిని చేరుకున్నామని బైజూస్ ప్రకటించింది. ఒకే ఏడాదిలో ఈ కార్యక్రమం 26 రాష్ట్రాల్లోని,340+ జిల్లాల్లోని 3.4 మిలియన్ విద్యార్థులకు చేరుకోగా, వారికి సాంకేతిక ప్రేరిత విద్యను చౌకగా,సమానంగా,అందరికీ లభించేలా చేసింది.ఈ మహోన్నతమై న ఒక ఏడాది వార్షికోత్సవం సందర్భంలో బైజూస్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ఈకార్యక్రమం ప్రారంభంలో 2025 నాటికి 5 మిలియన్ల బాలలకు ఉన్నతమైన నాణ్యత అభ్యాస
ప్రక్రియతో సాధికారత కల్పించే లక్ష్యంతో దాన్ని 10 మిలియన్ బాలలకు విస్తరించ నుంది.
బైజూస్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ మొదటి నుంచీ తన భాగస్వామ్యులైన ఎన్‌జీఓల ద్వారా భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలు అలాగే నగరాల్లోని మురికివాడల్లోని బాలలకు బైజూస్ ఉచిత స్ట్రీమింగ్ లైసెన్స్ ద్వారా చదువుకునేందుకు సమానమైన అవకాశాల ను కల్పిస్తోంది. ఇది దేశ వ్యాప్తంగా డిజిటల్డి వైడ్‌ను నివారించే లక్ష్యాన్ని కలిగి ఉండగా, విద్యార్థులకు తగిన వనరుల సహకారంతో సాధికారత కల్పించేందుకు, డిజిటల్ లెర్నింగ్‌కు సమగ్ర వ్యవస్థను రూపొందిస్తుంది.
ఇఎఫ్ఎకు ఎన్‌జీఓ భాగస్వాములు,ఆన్-గ్రౌండ్ ఫెసిలిటేటర్ల ద్వారా విద్యార్థులు ఇప్పుడు బైజూస్ యాప్‌ను ప్రాథమిక లెర్నింగ్ మోడల్‌గా వినియోగించుకోవచ్చు. ఈ ప్రయత్నంతో బాలల్లో ఈ యాప్‌ను వినియోగించుకునేందుకు గమనార్హమైన క్రియాశీలత,ఆకర్షణను కల్పించింది.అంతే కాకుండా బైజూస్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ కార్యక్రమంలో 50% మేర లబ్ధిదారులు ఆడపిల్లలు ఉన్నారు.
కెపిఎంజి (SROI method) ప్రారంభిక అధ్యయనం ప్రకారం 75% మంది రోజుకు సగటున 1 గంట ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు. ఈ అధ్యయనం ఈ అంశాలను ఆవిష్కరించింది:
● 57% మంది యాప్‌లో అభ్యాసాన్ని కొనసాగించగా, తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల నుంచి వచ్చిన ఒత్తిడితో కాకుండా, దానిలోని ఆసక్తిదాయకమైన కంటెంట్ వారిని క్రియాశీలకంగా ఉంచింది.
● 57% మంది వారి పనితీరును మెరుగుపరుచుకునేందుకు బైజూస్ అలాగే ఇతర అంశాలు (ఉదా: ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ట్యూషన్లు) సహకరించాయని తెలిపారు.
● ఈ 57% మందిలో 31% మంది ఈ మార్పు బైజూస్‌తో మాత్రమే వచ్చిందని చెప్పారు.
ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ వార్షిక మైలు రాయి గురించి బైజూస్ సహ- వ్యవస్థాపకురాలు దివ్యా గోకుల్‌నాథ్ మాట్లాడుతూ, ‘‘ఇఎప్ఏ సమానమైన అవకాశాలతో కూడిన విద్యా వ్యవస్థను వృద్ధి చేయాలన్న మా కలల నుంచి రూపుదిద్దుకుంది. ఈ కార్యక్రమం ఇంకా శైశవ దశలో ఉన్నప్పుడే ప్రపంచంపై కొవిడ్-19
మహమ్మారి దాడి చేసింది. మా సాంకేతికత-ఫస్ట్ నినాదం బోధన ఉపకరణాలు మహమ్మారితో నెలకొన్న విస్తారమైన అంతరాలను భర్తీ చేసేందుకు మద్ధతు ఇచ్చింది. విస్తరిస్తున్న మా వ్యూహాల్లో భాగంగా ఎన్‌జీఓల భాగస్వామ్యం ద్వారా మేము భారతదేశంలో అత్యంత కుగ్రామాలైన ఉరి, హైల్‌ఖండి, తిరప్, బస్తర్ తదితర చోట్ల లక్షలాది మంది బాలలకు నాణ్యతతో కూడిన విద్యను అందించగలుగుతున్నాము. ప్రతి రోజూ ఇందులో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ఎక్కువ అవుతోంది. బాలల మోముపై నవ్వును కాపాడడాన్ని చూడడం హృదయం తృప్తి చెందుతోంది. ప్రతి చిన్నారి నాణ్యతతో కూడిన విద్య, సమానంగా పొందాలన్న మా నిబద్ధతకు ఇది అద్దం పడుతుంది. మేము దేశంలోని యువ మనస్సుల అపారమైన ప్రతిభను కలిగి ఉన్నాము, సరైన వనరులు,మద్ధతుతో మేము భారతదేశపు భవిష్యత్తును మార్చేందుకు కట్టుబడి ఉన్నాము’’ అని తెలిపారు.
బైజూస్‌తో ఈ భాగస్వామ్యం గురించి అమెరికన్ ఇండియా ఫౌండేషన్ కంట్రీ డైరెక్టర్ మ్యాథ్యూ జోసెఫ్ మాట్లాడుతూ, ‘‘గత రెండేళ్లు కనెక్టెడ్,అన్ కనెక్టెడ్ మధ్య విస్తారమైన అనుసంధానతను ఆవిష్కరించగా, డిజిటల్ విధానాలను అలవర్చుకునేందుకు ఎక్కువ మంది ముందుకు వచ్చారు.బలహీన వర్గాలకు చెందిన లక్షలాది మంది విద్యార్థులకు అత్యుత్తమ నాణ్యత కలిగిన విద్యను లేదా సరైన వనరులు, పాఠ్యాంశాలు,వారి అభ్యాసాన్ని కొనసాగించేందుకు, విస్తరించేందుకు మార్గదర్శనం కొరతను కలిగి ఉన్నారు. బైజూస్‌తో ఎఐఎఫ్ భాగస్వామ్యం డిజిటల్ అంతరాలన మరింత విస్తరించే అటువంటి డిజిటల్ రెడీనెస్‌లో అసమానతలను నివారించే ఉద్దేశాన్ని కలిగి ఉంది,నిర్లక్షించబడిన గమనార్హమైన అభివృద్ధి పరిణామాలను కలిగి ఉంది. ఈ భాగస్వామ్యం గత ఏడాది వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది విద్యార్థులపై పరిణామాన్ని చూపించింది,ఇది ప్రారంభం మాత్రమే. ఈ భాగస్వామ్యం మాకు దేశ వ్యాప్తంగా చేరుకునేందుకు,మహమ్మారి అనంతరం ప్రపంచంలో డిజిటల్ రెడీనెస్ తక్కువ ఉన్నవారు వెనుకపడిపోకూడదని ధ్రువీకరిస్తుంది’’ అని తెలిపారు.
మహమ్మారి సమయంలో పాఠశాల మూతపడడంతో ఘట్‌కోపర్ భట్టవాడిలోని దినకూలీ కార్మికుని కుమార్తె, 9వ తరగతిలో తెలివైన విద్యార్థిని రియా మనోజ్ రాథోడ్ అభ్యాస ప్రక్రియ నిలిచిపోయింది.‘‘నేను ఎప్పుడూ నేర్చుకోవడాన్ని ఆనందిస్తున్నాను , వైద్యరాలిని కావాలని కోరుకునే దాన్ని. ఈ మహమ్మారితో పాఠశాలలు మూతపడ్డాయి ,ప్రతి ఒకటీ ఆన్‌లైన్‌లోకి రావడంతో నేను చదువుకోవడాన్ని కొనసాగించడం కష్టమైంది. మా నాన్నగారి ఆదాయంపైనా పరిణామాన్ని చూపించింది,అధ్యయనానికి డిజిటల్ పరికరాన్ని సమకూర్చుకోవడం అసాధ్యమైన కలగా ఉంది. బైజూస్ వారి ఇఎఫ్ఏ,రత్ననిధి ఫౌండేషన్ నాకు,నేను ఉంటున్న ప్రాంతంలోని కొందరికి ఉచిత ట్యాబ్లెట్, బైజూస్ వారి సెల్ఫ్-స్టడీ మాడ్యూళ్లను ఇవ్వడం ద్వారా సహకారాన్ని అందించారు. అంతేకాదు, నా కుటుంబానికి కూడా మౌలిక అవసరాల మద్ధతు
లభించింది. ఇప్పుడు నేను సులభం,అనుకూలకరంగా అధ్యయనం చేయగలను ,నా
కలలను నెరవేర్చుకోగలను. లెర్నింగ్‌ను కొనసాగించేందుకు మద్ధతు ఇస్తున్న బైజూస్‌కు నేను కృతజ్ఞతను తెలియజేస్తున్నాను’’ అని తెలిపారు.
వర్చువల్ ప్రపంచంలో డిజిటల్ విద్య అందుబాటుతో యువ విద్యార్థులు నేర్చుకునేందుకు, ఆవిష్కరించుకునేందుకు,వృద్ధి చెందేందుకు అసంఖ్యాత అవకాశాలను అందిస్తుంది.మహమ్మారి దేశం లోపల డిజిటల్ అంతరాన్ని భర్తీ చేసే అవసరాలను మరింత చాటి చెప్పింది,ఇంటర్నెట్ అనుసంధానం లేని,తగిన మౌలిక సదుపాయాలు లేని కుగ్రామాలకు అడుగు పెట్టి ఇఎఫ్ఐను విస్తరించేందుకు బైజూస్‌ను ప్రేరేపించింది. ఈ కార్యక్రమం ద్వారా బైజూస్ 110కు పైగా లాభరహిత సంస్థలైన ఉత్తర ప్రదేశ్‌లోని లాడ్లి ఫౌండేషన్, సేవ్ ది చిల్ట్రన్, స్మైల్ ఫౌండేషన్ ,యూరోపియన్ ఇండియా ఫౌండేషన్లు తెలంగాణలో దుర్బల వర్గాలకు చెందిన
విద్యార్థులకు విద్యను మరింత ఎక్కువగా అందుబాటులో ఉండేలా చేసింది. నీతి ఆయోగ్‌తో కలిసి బైజూస్ నీట్,జేఈఈలలో ఉత్తీర్ణత సాధించాలని కోరుకునే 10 ,11వ తరగతి చదువుతునన 112 జిల్లాల్లోని 3,000 ప్రతిభావంత విద్యార్థులకు ఉన్నత నాణ్యత కలిగిన టెస్ట్‌లో పోటీ పడేందుకు శిక్షణ ఇస్తోంది.
ఇఎఫ్ఏ ద్వారా బైజూస్ విద్యను ప్రజాస్వామీకరణ చేసేందుకు, ప్రతి విద్యార్థి నేర్చుకునేందుకు అవకాశాలను ఇచ్చేందుకు శ్రమిస్తోంది. కంపెనీ సాంకేతిక-ప్రేరిత లెర్నింగ్ కార్యక్రమాల ద్వారా అత్యంత కుగ్రామాల్లో ఉన్న అలాగే బలహీన వర్గాల సముదాయాలకు చెందిన బాలలకు సాధికారత కల్పించే ఉద్దేశాన్ని కలిగి ఉంది. ఈ కార్యక్రమం శిక్షణ ద్వారా బాలల్లో సామర్థ్యాన్ని వృద్ధి చేసే లక్ష్యాన్ని కలిగి ఉంది, దానితో ఆరోగ్యకరమైన, మరింత సందపద్భరితమైన సమాజం వైపు అడుగులు
వేసుంకు దేశం మొత్తం ప్రయాణించేందుకు ఉత్తేజిస్తుంది. మరింత తెలుసుకునేందుకు, click here.