Fri. Nov 22nd, 2024
Bytexl_NEW-OFFICE365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్16, 2022: ఐటీ కెరీర్‌ ఔత్సాహికుల కోసం సుప్రసిద్ధ అనుభవపూర్వక అభ్యాస వేదికలలో ఒకటైన బైట్‌ఎక్స్‌ఎల్‌(byteXL)హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీలో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది.

అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న స్టార్టప్‌, ఐటీ క్లస్టర్‌లోని ఐల్యాబ్స్‌ కేంద్రం వద్ద తెరిచిన ఈ నూతన కార్యాలయం నుంచి కార్యకలాపాలు నిర్వహించనుంది.

Bytexl_NEW-OFFICE365

దాదాపు 3200 చదరపు అడుగుల విస్తీర్ణంలో 75 మంది ఉద్యోగులు పనిచేయనున్నారు. ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌, ఆర్‌ అండ్‌ డీ అండ్ ఆవిష్కరణలలో గణనీయమైన పాత్రను పోషించనుంది.

ఈ కంపెనీ ఇప్పుడు తమ ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా వృద్ధి చేసుకునేందుకు ఇప్పటికే ప్రణాళిక చేసింది. మార్చి 2023 నాటికి తమ ప్రస్తుత 163 మంది ఫుల్‌టైమ్‌ ఉద్యోగులు, కన్సల్టెంట్ల సంఖ్యను 250కు చేర్చనుంది.

ఇది 90కు పైగా ఇనిస్టిట్యూట్‌లతో కలిసి పనిచేయడంతో పాటుగా ఏడు రాష్ట్రాలలో ఒకలక్షమందికి పైగా విద్యార్ధులకు నూతన తరపు సాంకేతికతలైన క్లౌడ్‌, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ), ఎంఎల్‌, డెవ్‌ఆప్స్‌, ఫుల్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌, సైబర్‌ సెక్యూరిటీ లను హైబ్రిడ్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అండ్ గైడెడ్‌ కెరీర్‌ యాక్సలరేటెడ్‌ ప్రోగ్రామ్‌ ద్వారా శిక్షణ అందిస్తుంది.

ఈ సందర్భంగా బైట్‌ఎక్స్‌ఎల్‌ ఫౌండర్ అండ్ సీఈఓ కరుణ్‌ తాడేపల్లి మాట్లాడుతూ ‘‘నూతన ప్రాంతాలకు విస్తరించడంతో పాటుగా మరిన్ని ఇనిస్టిట్యూట్‌లతో సైన్‌అప్‌ చేస్తున్నందున బైట్‌ఎక్స్‌ఎల్‌ వృద్ధి చెందుతూనే ఉందని అన్నారు.

వృద్ధి చెందుతున్న మా వినియోగదారులకు సేవలనందించేందుకు, మేము అత్యంత వేగంగా మా టీమ్‌లను విస్తరిస్తున్నాము, అందువల్ల, ఈ నూతన కార్యాలయం ఇప్పుడు వినూత్నమైన మేధావులను ఒకే దగ్గరకు తీసుకురానుందని ఆయన వెల్లడించారు.

Bytexl_NEW-OFFICE365

ఇనిస్టిట్యూట్‌ భాగస్వామ్యాల పరంగా అత్యున్నత వృద్ధిని మేము చూస్తున్నాము. ఇప్పటికి175 ఇనిస్టిట్యూట్‌లకు చేరడంతో పాటుగా 2.4 లక్షల మంది విద్యార్ధులను చేరుకున్నాము.

తద్వారా ఇనిస్టిట్యూట్‌ల పరంగా 100శాతం వృద్ధిని, విద్యార్ధుల పరంగా 140శాతం వృద్ధిని చూశాము’’ అని అన్నారు

ఈ కంపెనీ ఇప్పటికే 1.2 మిలియన్‌ డాలర్ల ఫండింగ్‌ను యుఎస్‌ కేంద్రంగా కలిగిన ఇన్వెస్టర్స్‌ నుంచి పొందింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి US $11 మిలియన్లను ఆదాయం లక్ష్యంగా చేసుకోవడం ద్వారా 400శాతం వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

బైట్‌ఎక్స్‌ఎల్‌ ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌తో అవగాహన ఒప్పందం (ఎంఓయు) చేసుకుంది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా టియర్‌ 2, టియర్‌ 3 విద్యాసంస్ధలకు చెందిన విద్యార్ధులకు నూతన తరపు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై శిక్షణను XLerate(ఎక్సలరేట్) కింద అందించనుంది. దీనికి ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) మద్దతు అందిస్తుంది.

Bytexl_NEW-OFFICE365

ఇవి కేవలం విద్యార్ధుల ఉద్యోగార్హత నైపుణ్యాలను వృద్ధి చేయడంలో అత్యంత కీలకపాత్ర పోషించడం మాత్రమే కాదు ఇనిస్టిట్యూట్‌ల పరివర్తనకు సైతం తోడ్పడి సుదీర్ఘకాలంలో నాణ్యమైన, పరిశ్రమ ఆధారిత ప్రతిభను తీర్చిదిద్దడంలోనూ తోడ్పడుతుంది.

స్టాటిస్టా అంచనాల ప్రకారం..భారతదేశపు ఎడ్‌టెక్‌ పరిశ్రమ మార్కెట్‌ వాల్యుయేషన్‌ 2020 నాటికి 2.8 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లు. 2025 నాటికి అది10.4 బిలియన్‌డాలర్లుగా ఉండవచ్చని అంచనా.

ఎడ్‌టెక్‌ విభాగంలో నైపుణ్యాభివృద్ధి పరంగా మార్కెట్‌ పరిమాణం 260 మిలియన్‌ డాలర్లుగా ఉంది. 2025 నాటికి అది 730 మిలియన్‌ డాలర్లుకు వృద్ధి చెందనుందని అంచనా వేస్తున్నారు.

error: Content is protected !!