365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, గోల్కొండ కోట,ఆగష్టు 11,2021:స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోట వద్ద చేస్తున్న ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం పరిశీలించారు. అధికారులు సమన్వయము తో వ్యవహారించి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేయాలని అదేశించారు. స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 15 వ తేది ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు.
వేదిక వద్దనే పోలీసు,GHMC, R&B, I&PR, సాంస్కృతిక,రెవెన్యూ శాఖల అధికారులతో ఏర్పాట్లను సి. ఎస్. సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు.ఈ పర్యటనలో టిఆర్ అండ్ బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, పి ఆర్. కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేశ్ కుమార్ , అడిషనల్ డిజిపి (Law & Order) జితేందర్, స్టాంపులు, రిజిష్ట్రేషన్ల CIG శేషాద్రి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్, ప్రోటోకాల్ జాయింట్ సెక్రటరీ అరవిందర్ సింగ్, I&PR విభాగం అదనపు డైరెక్టర్ నాగయ్య కాంబ్లే, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఇతర పోలీసు, GAD, GHMC అధికారులు పాల్గొన్నారు