Sun. Jan 5th, 2025

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 2,2025: సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి అధ్యక్షత వహిస్తున్నారు. రైతు భరోసా పథకం అమలుపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి.

సంక్రాంతి పండుగ నాటికి రైతు భరోసా అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, ఈ సబ్ కమిటీ నివేదిక పూర్తికావడం కీలకంగా ఉంది.

గతంలో అమలైన విధానాలకు భిన్నంగా, ఈ సారి పంట సాగు చేసే నిజమైన రైతులకే భరోసా అందించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రజాధనం వృథా కాకుండా, లబ్ధిదారుల గుర్తింపు కోసం గూగుల్ డేటా,సాటిలైట్ ఇమేజింగ్ ఆధారంగా పంట సాగు విస్తీర్ణాన్ని లెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇప్పటికే ఈ విధానంపై సాటిలైట్ ఇమేజింగ్ ఏజెన్సీలతో మంత్రి తుమ్మల సమావేశాలు నిర్వహించారు.

డిప్యూటీ సీఎం బట్టి అధ్యక్షతన ఏర్పాటైన ఈ సబ్ కమిటీ సభ్యులుగా తుమ్మల, ఉత్తం, శ్రీధర్ బాబు, పొంగులేటి ఉన్నారు.

ఈ సమావేశంలో హాజరైనవారిలో ముఖ్యంగా మంత్రులు తుమ్మల, పొంగులేటి ఉన్నారు

error: Content is protected !!