365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, 5 ఏప్రిల్ 2022: బోంజోర్ ఇండియా సినీ-ఫుడ్ అనుభవం, ‘కేఫ్-సినిమా’ ఏప్రిల్ 2వ తేదీన హైదరాబాద్‌లో జరిగింది. కేఫ్-సినిమా అనేది బాన్‌జో ఇండియా ప్రయత్నాల్లో భాగం కాగా,ఇది ఫ్రాన్స్ రాయబార కార్యాలయం,దాని సాంస్కృతిక సేవల ఇనిస్టిట్యూట్ ఫ్రాంకైస్ ఎన్ ఇండే, అలయన్స్ ఫ్రాంఛాయిస్ నెట్‌వర్క్ , ఫ్రాన్స్ కాన్సులేట్‌ల కళాత్మక, సాంస్కృతిక, విద్యా,సామాజిక ఇనీషియేటివ్.

సినిమా,ఆహార ప్రియుల కోసమే ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
ఉద్దేశించబడింది. కేఫ్-సినిమాలో, సందర్శకులు డెలిసియక్స్ చిత్రాన్ని వీక్షిస్తూ, ఫ్రెంచ్ వంటకాలను ఆస్వాదించారు – ఇది ఫ్రెంచ్ వంటకాలకు దృశ్యరూపంలోని విందును అందించే చిత్రం. ఇది ఆరుబయలు ప్రదేశంలో సినిమాటిక్-గ్యాస్ట్రోనమిక్ అనుభవం! సందర్శకులు వైన్ గ్లాసులు, రుచికరమైన ఫ్రెంచ్ వంటకాలను పట్టుకుని, సినిమాను ఆస్వాదించడానికి ఆకాశమనే పైకప్పు కింద కూర్చున్నారు. రెండేళ్లు సుదీర్ఘంగా కొనసాగిన మహమ్మారి అనంతరం కలుసుకునేందుకు,

పలకరించుకునేందుకు,ఉల్లాసంగా ఉండేందుకు, ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రదేశం సరైనదని నిరూపించింది. ఈ అత్యున్నత స్థాయి ప్రత్యేక కార్యక్రమంలో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటి,పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయస్ రాజన్, భారతదేశంలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం, విద్య, సైన్స్ అండ్ కల్చర్ కౌన్సెలర్ ఇమ్మాన్యుయేల్ లెబ్రూన్-డామియన్స్, హైదరాబాద్‌లోని అలయన్స్ ఫ్రాంఛాయిస్ డైరెక్టర్ డా.శ్యామ్యూల్ బెర్ట్, నోవాటెల్ హెచ్ఐసిసి జనరల్ మేనేజర్ మనీశ్ దయ్య, రోటోమేకర్ ,ఆర్ఐఎఫ్‌టిఐ యజమాని మైక్ రెడ్డి, సాఫ్రాన్ జనరల్
మేనేజర్ గెరార్డ్ ఇనిజాన్, డెకథ్లాన్ సిటీ లీడర్ ఫ్రాంక్ లెజూనే, కేంద్ర ఏరోస్పేస్ ,రక్షణ శాఖ అధికారి పి.ఎ.ప్రవీణ్, హైదరాబాద్‌కు చెందిన అలయన్స్ ఫ్రాంఛాయిస్ స్నేహితులు,నోవాటెల్ గెస్టులు పాల్గొన్నారు.

సౌకర్యంగా, జ్ఞాపకాలు,అభిరుచులను జీవితకాలం గుర్తుంచుకునేలా కొన్ని గంటల పాటు నెమరు వేసుకునేందుకు ఇది సరైన వేదికగా నిరూపించబడింది. ఫ్రాన్స్‌లో 18వ శతాబ్దపు విప్లవానికి పూర్వపు నేపథ్యంలో, తొలి రెస్టారెంట్‌ను ప్రారంభించిన కథాంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని రూపొందిన డెలిసియక్స్ సినిమా హాస్యం మాత్రమే కాకుండా అనేక సన్నివేశాల్లో ఆహ్లాదకరమైన వంటకాలను చూపిస్తూ, ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా కేఫ్-సినిమాలో వాతావరణాన్ని రెట్టింపు
ఆహ్లాదకరంగా,ఉల్లాసంగా మార్చివేసింది. హైదరాబాద్‌లోని అలయన్స్ ఫ్రాంఛాయిస్
నోవోటెల్ హెచ్ఐసిసి, ఆర్ఐఎఫ్‌టిఐ,తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యాన్ని కలిగి
ఉండడంతో ఈ కార్యక్రమాన్ని ముత్యాల నగరంలో నిర్వహించారు.

నోవాటెల్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లోని లాన్స్‌లో సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమైన బాన్‌జో ఇండియా ఫెస్టివల్ హైదరాబాద్ ప్రారంభోత్స వాన్ని కేఫ్-సినిమా అనుసరించింది. ఇది ఆహ్వానం ద్వారా మాత్రమే జరిగిన కార్యక్రమం. హాజరైన అతిథులు హై టీతో పాటు వైన్‌ను కూడా ఆస్వాదించారు.
భారతదేశంలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం, విద్య, సైన్స్ అండ్ కల్చర్ కౌన్సెలర్ ఇమ్మాన్యుయేల్ లెబ్రూన్-డామియన్స్ కేఫ్-సినిమా గురించి మాట్లాడుతూ, ‘‘మహమ్మారి, దానితో విధించిన లాక్‌డౌన్‌లు మనందరినీ దెబ్బతీశాయి. ఇటీవలే సినిమాలు,రెస్టారెంట్లు పూర్తి సామర్థ్యంతో తిరిగి ప్రారంభిస్తున్నారు.

కేఫ్-సినిమా ఉత్తమమైన సినిమా,వంటకాలను ఒకే ఒక్క కోలాహలమైన ఈవెంట్‌కు అందించింది. ప్రజలు మంచి ఫ్రెంచ్ ఆహారాన్ని ఆస్వాదించడమే కాకుండా
వినోదభరితమైన సినిమాను కూడా చూశారు. అదే సమయంలో, వారంతా చక్కగా మనసు విప్పి మాట్లాడుకున్నారు. చాలా మంది స్నేహితులు, కుటుంబ సభ్యులతో వచ్చారు. బీరు, కెనాప్స్,వైన్, సినిమా,గొప్ప సంభాషణను ఆస్వాదించారు. కేఫ్-సినిమాలో ఆస్వాదించిన రుచులు వారు అంత త్వరగా మర్చిపోలేరు’’ అని పేర్కొన్నారు.

బాన్‌జో భారతదేశంలో ఈవెంట్‌లను ఆహ్లాదకరంగా, వినోదం కోసం ఆలోచనాత్మకంగా
రూపొందించింది. ఇవన్నీ పలు సందర్భాలలో ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఇది ఫ్రెంచ్,భారతీయ సాంస్కృతిక మూలాంశాలను సులభంగా తెలుసుకునే చేయడం ద్వారా భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య భాగస్వామ్యాన్ని, అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇది నిర్వహించే కార్యక్రమాలు అన్నీ, అన్ని వయసుల, నేపథ్యాల ప్రేక్షకులను అలరించేందుకు,సజీవ,స్నేహపూర్వక చర్చలకు దారితీయడానికి ఉద్దేశించబడ్డాయి. ఈ సంఘటనలు భారతదేశం ,ఫ్రాన్స్ మధ్య శతాబ్దాల సుదీర్ఘ పరస్పర సంబంధాలు,స్నేహాన్ని వేడుక చేసుకునేలా ఉంటాయి.

అవి నియోఫైట్స్, ఔత్సాహికుల కోసం ఒకే విధంగా రూపొందించబడ్డాయి. కుటుంబాలు, విద్యార్థులు, యువకులు,ఇతరులు అందరూ కలిసి చర్చించేందుకు, అన్వేషించేందుకు, జీవితకాలం గుర్తుండిపోయే జ్ఞాపకాలు,అనుభవాలను రూపొందించుకునే వేదికలుగా పనిచేస్తాయి. ఇటువంటి పలు కార్యక్రమాల సెట్టింగ్‌లను అందరికీ తేలికగా అందుబాటులో ఉండే స్థలాల్లో సంస్థ నిర్వహిస్తుంది.