365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,24 జూన్ ,2025: సమకాలీన, ట్రెండ్-ఆధారిత డిజైన్లకు ప్రసిద్ధి చెందిన కళ్యాణ్ జ్యువెలర్స్ జీవనశైలి ఆభరణాల బ్రాండ్ కాండెరే, హైదరాబాద్‌లోని ఆర్కేడ్ విల్లా మేరీ రోడ్లో మూడో స్టోర్‌ను ప్రారంభించింది.
ఈ కొత్త స్టోర్‌తో కాండెరే దేశవ్యాప్తంగా 75 అవుట్లెట్లతో వినియోగదారులకు చేరువవుతోంది. ఈ ప్రగతి కాండేరే ప్రత్యేక, విస్తృత శ్రేణిలో ఆభరణాలను విస్తృత స్థాయిలో అందించేందుకు ఉన్న నిబద్ధతను నిరూపిస్తుంది.
హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా కాండేరే యొక్క ఈ విస్తరణ వాణిజ్య పురోగతిలో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తోంది. కస్టమర్లకు మరింత సౌకర్యవంతమైన షాపింగ్ అనుభవాన్ని అందించడానికి ఆన్లైన్, ఆఫ్‌లైన్ చానెల్ల సమగ్ర సమన్వయంపై బ్రాండ్ దృష్టి పెట్టింది.
జెన్ జి, పని చేసే వ్యక్తులు,ఫ్యాషన్‌కు ప్రాధాన్యం ఇచ్చే యువతకు అనుకూలంగా, కాండేరే తేలికైన, స్టైలిష్ ఆభరణాలతో గుర్తింపు పొందింది. 10,000 రూపాయల నుంచి ప్రారంభమయ్యే ధరలతో సమకాలీన, ట్రెండ్లను ప్రతిబింబించే ఆభరణాలను ఈ బ్రాండ్ అందిస్తుంది. ఈ కలెక్షన్లు ప్రత్యేక క్షణాలకు అద్భుతమైన బహుమతులుగా నిలుస్తాయి.
Read This also…Candere Opens Its 3rd Store in Hyderabad, Celebrates 75th Outlet Across India..
Read This also…5 Exciting Ways to Use Balsamic Vinegar in Indian Meals This Week
కొత్త స్టోర్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని, కాండేరే ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది: డైమండ్,సాలిటైర్ స్టోన్లపై ఫ్లాట్ 20% తగ్గింపు, బంగారం, ప్లాటినం ఆభరణాలపై ఫ్లాట్ 25% తగ్గింపు.

డిజిటల్-ఫస్ట్ నుంచి బలమైన ఓమ్నిచానల్ రిటైలర్‌గా ఎదిగిన కాండేరే, ఆన్లైన్, షోరూమ్‌లలో వినియోగదారులకు సులభమైన, ఆకర్షణీయమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తోంది. కళ్యాణ్ జ్యువెలర్స్ వారసత్వం,నమ్మకంతో, ఈ బ్రాండ్ క్రమంగా విస్తరిస్తూ, వ్యక్తిత్వం మరియు శైలిని ప్రతిబింబించే ఆభరణాలను రూపొదుపుతోంది.
ఇది కూడా చదవండి…జనవరి-మార్చిలో వినియోగ రుణాల్లో బకాయిలు స్థిరంగా కొనసాగిన సూచనలు..
Read This also…Credit Delinquencies Stabilize for Personal Loans, Credit Cards in March Quarter..
హైదరాబాద్‌లోని ఆర్కేడ్ విల్లా మేరీ రోడ్ లో తాజా స్టోర్ ప్రారంభంతో, కాండేరే మారుతున్న కస్టమర్ అభిరుచులకు అనుగుణంగా ఆభరణాలను రూపొందించి, జీవితం లో చిరస్మరణీయ క్షణాలను ఘనంగా జరుపుకునే వాగ్దానం చేస్తోంది. తాజా కలెక్షన్లు, ఆఫర్ల వివరాల కోసం www.candere.com ని సందర్శించండి.