Sun. Dec 1st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,నవంబర్ 17, 2024 : లివ్ యువర్ సిటీ సంస్థ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లో ఇటీవల ‘ట్రిబ్యూట్ టు కోల్డ్‌ప్లే’ షోతో క్యాండిల్‌లైట్ కాన్సర్ట్స్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ షోకు ప్రేక్షకుల నుంచి అపూర్వ స్పందన లభించింది. టిక్కెట్లు పూర్తిగా అమ్ముడవ్వ డంతో పాటు, ప్రదర్శన ఆసాంతం ప్రేక్షకుల నుంచి స్టాండింగ్ ఓవేషన్స్ రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ విజయానికి కొనసాగింపుగా, డిసెంబర్‌లో ఇదే హోటల్‌లో ‘బెస్ట్ మూవీ సౌండ్‌ట్రాక్స్’ పేరుతో మరో ప్రత్యేక సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే, గచ్చిబౌలిలోని హయాత్ హోటల్‌లో ‘క్వీన్ vs ABBA’ ట్రిబ్యూట్ ప్రదర్శన నిర్వహించనున్నారు.

“హైదరాబాద్‌లో క్యాండిల్‌లైట్ కాన్సర్ట్స్‌కు లభించిన ఆదరణ మనకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. తెలంగాణవ్యాప్తంగా విస్తరించే క్రమంలో ప్రపంచ స్థాయి సంగీత ప్రదర్శనలను అందించడమే కాకుండా స్థానిక సంస్కృతులకు గౌరవాన్ని చాటే భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడం మా లక్ష్యం” అని లివ్ యువర్ సిటీ ఇండియా కంట్రీ మేనేజర్ దీపా బజాజ్ తెలిపారు.

ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పుణే నగరాల్లో విజయవంతమైన ఈ క్యాండిల్‌లైట్ కాన్సర్ట్స్, ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా ప్రారంభమవడం ఈ సిరీస్ ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.

error: Content is protected !!