CapitalVia to launch mobile app for Investment AdvisesCapitalVia to launch mobile app for Investment Advises

గత సంవత్సర సమీక్ష

·భారతదేశంలో అత్యంత కఠినమైన లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులో ఉన్నాయి. అంతర్జాతీయంగా సరఫరా గొలుసుకట్టులో అవాంతరాలు ఏర్పడ్డాయి ,ఆర్ధిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా భారతదేశంలో సాంకేతికంగా సంక్షోభం ఏర్పడింది.

·రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ,కొన్ని ఐటీ, ఫార్మా దిగ్గజాలు మాత్రమే బెంచ్‌మార్క్‌ సూచీలలో  ర్యాలీని తొలుత కొనసాగించాయి,ఆ ర్యాలీని మార్కెట్‌లో కొనసాగించడానికి విదేశీ పెట్టుబడుల ప్రవాహం కూడా మద్దతునందించింది.

· ఎంఎస్‌సీఐ తమ అంతర్జాతీయంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌ సూచీలలో భారతదేశపు హోదాను 8.1% నుంచి 8.7%కు వృద్ధి చేయడం వల్ల మరింతగా ఈ వృద్ధికి తోడ్పాటు కలిగింది.

· మొత్తం 12 నెలల కాలంలో ఏడు నెలలు విదేశీ మదుపరుల నుంచి పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది. నవంబర్‌ నెలలో అత్యధికంగా విదేశీ నిధులు ఈ సంవత్సరంలో వచ్చాయి. ఇది 65,317.13 కోట్ల రూపాయల వరకూ ఉంది.

· బెంచ్‌మార్క్‌ సూచీలు ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ పద్ధతిలో 14.58% లాభపడ్డాయి. నిఫ్టీ దాదాపు 86.72 %  వరకూ 2020 సంవత్సరంలో మార్చి నెల కనిష్టంతో పోలిస్తే లాభ పడింది.

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ జనవరి 19 ,2021:భారతప్రభుత్వం ఆరంభించిన డిజిటల్‌ ఇండియా ప్రచారానికి మద్దతునందిచడంతో పాటుగా సాంకేతిక రంగంలో డిజిటల్‌గా దేశం అభివృద్ధి చెందేందుకు మద్దతునందిస్తూ క్యాపిటల్‌ వయా (CapitalVia)  ఇప్పుడు పెట్టుబడుల సలహా విభాగాన్ని ఆధునీకరిస్తూ తమ కస్టమర్‌ పోర్టల్‌ క్యాపిటల్‌ వయా యాప్‌ను పరిచయం చేసింది. వాస్తవ సమయంలో సలహాలు అందించడం ద్వారా ఎలాంటి క్లిష్టత లేని వినియోగదారుల అనుభవాలను అందించే రీతిలో దీనిని రూపకల్పన చేయడంతో పాటుగా మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారానే సమస్యలను సైతం పరిష్కరించే రీతిలో తీర్చిదిద్దారు.ఈ అప్లికేషన్‌ ఇప్పుడు టియర్‌ 2 ,టియర్‌ 3 నగరాలలోని మదుపరులకు అధికంగా సహాయపడనుంది. దీనిద్వారా వారు పెట్టుబడుల అవకాశాలను,స్టాక్‌ మార్కెట్‌ గురించి తెలుసుకోవడంతో పాటుగా ఒక్క క్లిక్‌తో  నాలెడ్జ్‌ కేంద్రం ,సూచనలను సైతం వినియోగించుకోగలరు. ఈ డిజిటల్‌ పోర్టల్‌  ఇప్పుడు రాష్ట్రంలో డిజిటల్‌ పెట్టుబడులను సాధారణీకరించడంతో పాటుగా మదుపరుల నడుమ నమ్మకాన్ని సైతం పెంపొందించనుంది.

CapitalVia to launch mobile app for Investment Advises
CapitalVia to launch mobile app for Investment Advises

ఈక్విటీ మార్కెట్‌కోసం క్యాపిటల్‌ వయా యాప్‌ ఆవిష్కరణ కోసం ఆంధ్రప్రదేశ్‌ ను ఎంచుకోవడానికి స్ఫూర్తి కలిగించిన అంశాలు

1.భారతదేశ వ్యాప్తంగా గత 9 నెలల కాలంలో డీమ్యాట్‌ ఖాతాల వృద్ధి 16% కనిపిస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అది 33% వృద్ధిని నమోదు చేసింది.

2. మా వ్యాపారంలో మొత్తంమ్మీద 5% తోడ్పాటును దక్షిణ భారతదేశం అందిస్తుంటే, ఆ ప్రాంతంలోనూ ఆంధ్రప్రదేశ్, విజయవాడలలోనే మా వ్యాపారం అధికంగా జరుగుతుంది.

3.దాదాపు 63 లక్షల నూతన డీమ్యాట్‌ ఖాతాలు తెరువ బడితే, హైదరాబాద్,విజయవాడ నగరాలలో అధికంగా ఇవి ఉన్నాయి.

4. ఇక్కడ జనాభా దాదాపు 8.5 కోట్ల మంది ఉంటే, వారి రమారమి వయసు 27 సంవత్సరాలు

5. అతి సులభంగా వ్యాపార నిర్వహణ పరంగా ప్రపంచబ్యాంక్‌ చేత నెంబర్‌ 1 ర్యాంక్‌ పొందింది.

రాబోతున్న కేంద్ర బడ్జెట్‌ 2021 ఇప్పుడు మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత బలోపేతం చేస్తుందని అంచనా,పెట్టుబడి అవకాశాలను ఈక్విటీ,డెబ్ట్‌ ఫండ్‌ విభాగాలలో వృద్ధి చేయనుందని భావిస్తున్నారు.  మదుపరులతో పాటుగా వాణిజ్య వేత్తలు సైతం 2021లో మార్కెట్‌ నుంచి బడ్జెట్‌ ప్రకటనకు ముందు ఈ దిగువ అంశాలను ఆశించవచ్చు.

బడ్జెట్‌ అంచనాలు, మార్కెట్‌పై దాని ప్రభావం

ప్రస్తుత వాతావరణం బడ్జెట్‌ను సమ్మిళిత, ఉత్తేజపరిచే ,వృద్ధి ఆధారితంగా ఉండాలని కోరుతుంది.  2020వ సంవత్సరంలో సుదీర్ఘంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా జీడీపీ తీవ్రంగా ప్రభావితమైంది,ఆర్ధిక వ్యవస్ధ సాంకేతికంగా సంక్షోభంలో కూరుకుపోయింది. గత క్యాలెండర్‌ సంవత్సరంలో ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలకు అనుగుణంగా రాబోయే బడ్జెట్‌ ఉంటుందని మార్కెట్‌ అంచనా వేస్తున్నట్లు కనబడుతుంది. ప్రాధాన్యత, కీలక రంగాలకు ఆర్ధిక ఉపశమనంతో పాటుగా తగు రీతిలోసహాయం కూడా అందించవచ్చు. బ్యాంకింగ్‌ రంగంను సైతం ఇప్పుడు తగు రీతిలో కాపాడుకోవాల్సి ఉంది. ఎందుకంటే మారటోరియం  ప్రభావం రాబోయే రోజులలో ఇది తప్పనిసరిగా కనిపించనుంది. ఎన్‌పీఏలు మరోమారు ఓ సమస్యగా పరిణమించవచ్చు. అందువల్ల ఈ సమస్యను సైతం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది.బడ్జెట్‌ ఎప్పుడూ కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతూనే ఉంటుంది. అది స్వల్పకాలికం లేదా దీర్ఘకాలికం కావొచ్చు. కానీ రాబోయే బడ్జెట్‌ మాత్రం అత్యంత కీలకమైనది. ఎందుకంటే దీని పట్ల మదుపరులతో పాటుగా సామాన్యులు కూడా ఒకే విధమైన ఆశతో ఉన్నారు. ఒకవేళ బడ్జెట్‌ అంచనాలను అందుకోలేకపోతే, మార్కెట్‌ తనంతట తానుగా గణనీయంగా కరెక్ట్‌ చేసుకునే అవకాశాలున్నాయి.

CapitalVia to launch mobile app for Investment Advises
CapitalVia to launch mobile app for Investment Advises

ఈక్విటీ మార్కెట్‌ వ్యూ

భారతీయ బెంచ్‌మార్క్‌ సూచీలు గత సంవత్సరం అద్భుతమైన ప్రదర్శననే చేశాయి. మొత్తంమ్మీద 11 నెలల కాలంలో భారతీయ మార్కెట్‌లు గత సంవత్సరం ఏడు నెలల పాటు స్థూల విదేశీ నగదు ప్రవాహాన్ని అందుకున్నాయి. నిఫ్టీ అయితే 14%కు పైగా రాబడులను సృష్టించింది. భారతీయ మార్కెట్‌  వాల్యూయేషన్లు ఇప్పటికైతే ఖరీదుగానే కనిపిస్తున్నాయి. అందువల్ల, బెంచ్‌మార్క్‌లు స్థిరపడే అవకాశాలు మొండుగా ఉన్నాయి. 2021 సంవత్సరాంతానికి నిఫ్టీలో రెండెకల వృద్ధిని మేము  అంచనా వేస్తున్నాము. దీనికి రిటైల్‌  భాగస్వామ్యం పెరగడం, ప్రభుత్వం ,అనుకూల విధానాలు, డిమాండ్‌ పునరుద్ధరణ ,తాజా విదేశీ నగదు ప్రవాహాలు కారణం. అయితే ఈ వృద్ధి వేగం అనేది 2020లో కనిపించినంతగా మాత్రం ఉండకపోవచ్చు. నూతన వైరస్‌ స్ట్రెయిన్‌ ప్రమాదం ఉన్నందున అడపాదడపా సర్దుబాట్లును తోసిపుచ్చలేము. అందువల్ల ఆర్ధిక పునరుద్ధరణ అనేది అత్యంత కీలకం.

డెబ్ట్ మార్కెట్‌ వ్యూ

బాండ్‌ ధరలు 2020వ సంవత్సరంలో పెరిగాయి. ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గించడం దీనికి కారణం. అందువల్ల, స్పెక్ట్రమ్‌ వ్యాప్తంగా  డెబ్ట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు ప్రయోజనం పొందాయి. దీర్ఘకాలిక బాండ్లు అయినటువంటి గిల్ట్‌, సుదీర్ఘకాల, డైనమిక్‌ బాండ్‌ ఫండ్లు రెండెంకల రాబడులను అందించాయి. 2021 క్యాలెండర్‌ సంవత్సరంలో అదే విధమైన అంచనాలను వేయలేము. వడ్డీరేట్లు బాగా తక్కువగా ఉండటంతో పాటుగా మరింతగా ఈ వడ్డీ రేట్లలో కోత పడే  అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ద్రవ్యోల్భణం పెరుగుతుండటం, అత్యధికంగా ప్రభుత్వం అప్పులు తీసుకోవడం దీనికి కారణం. అందువల్ల, మదుపరులు నెమ్మదిగా మ్యూచువల్‌ ఫండ్స్‌ హోల్డింగ్స్‌,సుదీర్ఘకాలం నిలిచి ఉండే బాండ్లు అయిన గిల్ట్, సుదీర్ఘకాల వ్యవధి కలిగిన ఫండ్స్‌పై రాబడులను పొందగలరు. వడ్డీరేట్లు మరింతగా పడిపోయే అవకాశాలు లేనందున, సమీపకాలంలో అవి వృద్ధి చెందే అవకాశాలు కూడా లేవు. క్రెడిట్‌ రిస్క్‌ను పరిగణలోకి తీసుకున్న తరువాత కాస్త అధిక రాబడులను కోరుకునే ఇన్వెస్టర్లు  కార్పోరేట్‌ ఎఫ్‌డీలు ,సెకండరీ మార్కెట్‌ బాండ్ల వైపు చూడవచ్చు