365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబై,జూన్ 4,2024: భారతదేశపు ప్రముఖక్రెడిట్-ఆధారిత, ఏఐ-ఆధారిత ఫైనాన్షియల్ ప్లాట్‌ఫాం క్యాష్ఈ తమ ఇన్-హౌస్ డిజిటల్ ఇంజినీరింగ్ కార్యకలాపాల విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో కొత్త టెక్నాలజీ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు చేసే ప్రణాళికలను ప్రకటించింది.
ఈ కొత్త కార్యాలయం ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా ఉపయోగపడనుంది. రుణాలు, బీమా, వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో కార్యకలాపాలకు సంబంధించి ఫిన్‌టెక్ కంపెనీ సాంకేతికత అవసరాల కోసం ఇది తోడ్పాటు అందించనుంది.
అలాగే, టెక్నాలజీ, డేటా సైన్సెస్, మెషిన్ లెర్నింగ్, DevOps, TechOps, ప్రోడక్ట్ డెవలప్‌మెంట్, క్రెడిట్, వసూళ్లు వంటి విభాగాల్లో వివిధ స్థాయుల్లో అనుభవమున్న వారిని నియమించుకునే ప్రణాళికలు కూడా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
భారతదేశ ఫిన్‌టెక్ రంగంలో తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడంపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెడుతోంది. కంపెనీకి ప్రస్తుతం హైదరాబాద్, ముంబై సెంటర్లలో 550 మంది సిబ్బంది ఉన్నారు.
ఈ క్యాలెండర్ సంవత్సరం ఆఖరు నాటికి 300 మంది వరకు ఉద్యోగులను నియమించుకునే యోచనలో సంస్థ ఉంది. ప్రతిభావంతులను నియమించుకునేవ్యూహానికి అనుగుణంగా వీరిలో 150 మందిని కొత్త సెంటర్ కోసం తీసుకోనుంది.
క్యాష్ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ యషోరాజ్ త్యాగి ఈ ప్రణాళికలను ధృవీకరించారు. “ఫిన్‌టెక్ రంగం ప్రస్తుతం గణనీయంగా పరివర్తన చెందుతోంది. రుణాలు, బీమా, వెల్త్‌టెక్ విభాగాల్లో మా ఫిన్‌టెక్ సొల్యూషన్స్‌కి నెలకొన్న డిమాండ్‌కు అనుగుణంగా మా బృందాలు,మౌలిక సదుపాయాలను మేము వేగవంతంగా పెంచుకుంటున్నాం.
దేశంలోనే ప్రీమియర్ బిజినెస్ హబ్‌లలో ఒకటైన వ్యూహాత్మక ప్రాంతంలో కొత్త సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. విస్తరిస్తున్న మా వ్యాపారాలు, కస్టమర్ల అవసరాలను తీర్చే దిశగా గణనీయంగా సిబ్బందిని పెంచుకునేందుకు ఇది తోడ్పడగలదు.
ప్రతిపాదిత హైరింగ్‌తో దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఫిన్‌టెక్ స్టార్టప్‌లలో ఒకటైన మా సంస్థలో చేరేందుకు వివిధ విభాగాల్లో ప్రతిభావంతులైన నిపుణులకు అవకాశం లభించగలదు” అని ఆయన పేర్కొన్నారు.
క్యాష్ఈకి దేశవ్యాప్తంగా 18,000 పైచిలుకు పిన్ కోడ్‌లలో యూజర్లు ఉన్నారు. కొలేటరల్-ఫ్రీ వ్యక్తిగత రుణాలు, ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లిమిట్, బీఎన్‌పీఎల్ సేవలను అందిస్తుండటంతో పాటు కంపెనీ ఇటీవలే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రుణాలు, విద్యా రుణాలను కూడా ఆవిష్కరించింది.
‘భారత్ కా మనీ యాప్’ ట్యాగ్‌లైన్‌తో క్యాష్ఈ ఇటీవలే తమ సూపర్ యాప్‌ను సైతం ప్రవేశపెట్టింది. ప్రీమియర్రుణ ఆధారిత ఫైనాన్షియల్ ప్లాట్‌ఫాంగా ఎదగాలన్న బ్రాండ్ లక్ష్యానికి ఇది దోహదపడనుంది.
సమగ్రమైన ఆర్థిక సేవలు అందించడం ద్వారా పట్టణ హబ్‌లలో, ద్వితీయ శ్రేణి+ (Urban Hubs andTier 2+ Cities) నగరాల్లోని యువ వర్కింగ్ మిలీనియల్స్ ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ఈ సూపర్ యాప్ ఉపయోగపడుతుంది.
దీనితో యూజర్లు తమ వైవిధ్యమైన ఆర్థిక అవసరాలకు అనుగుణంగా రుణాలు, పెట్టుబడులు, బీమా సేవలన్నింటినీ ఒకే ప్లాట్‌ఫాంపై పొందవచ్చు.
ఇది కూడా చదవండి :తెలంగాణ లోక్‌సభ ఓట్ల లెక్కింపు ప్రారంభం; మధ్యాహ్నం 3 గంటలలోపు ఫలితాలు
Also read :Mahindra Celebrates 25 Years of Bolero Pik-Ups: A Legacy of Reliability and Performance
Also read :Edelweiss Tokio Life Insurance is now Edelweiss Life Insurance