365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 22,2023: పశ్చిమ బెంగాల్‌లో బలవంతపు మతమార్పిడుల ఆరోపణలకు సంబంధించిన కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)దర్యాప్తు ప్రారంభించింది.
గత ఏడాది పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో బలవంతపు మత మార్పిడులకు పాల్పడ్డారనే ఆరోపణలపై కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రాథమిక విచారణ ప్రారంభించింది.
ఈ మేరకు బుధవారం అధికారులు సమాచారం అందించారు. 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చినందుకు ఇద్దరు సోదరుల బలవంతపు మతమార్పిడిపై దర్యాప్తు చేయడానికి ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు సీబీఐ ప్రాథమిక విచారణను ప్రారంభించింది.