365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, న్యూఢిల్లీ, మార్చి10, 2023:రాజీవ్ గాంధీ రాష్ట్రీయ శిశు సదన్ యోజన (క్రెష్ స్కీమ్)లో జరిగిన ఆర్థిక అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ చేపట్టింది.
ఈ పథకం అమలు చేసే ఏజెన్సీలలో చైల్డ్ వెల్ఫేర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఒకటి. ఈ మేరకు గురువారం అధికారులు సమాచారం అందించారు.
మహిళా,శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి అందిన సమాచారం ఆధారంగా, భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ల కింద నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, మోసానికి సంబంధించిన అజ్ఞాత వ్యక్తులపై కేసు నమోదు చేసారు.
సీబీఐ తన దర్యాప్తును చేపట్టింది. గతంలో ఢిల్లీ పోలీసులు ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఈ పథకంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేసేందుకు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అధ్యక్షతన త్రిసభ్య కమిటీని ఢిల్లీ హైకోర్టు ఏర్పాటు చేసినట్టు సమాచారం.
ఈ కమిటీ నివేదిక ఆధారంగా సీబీఐ లాంటి ఏజెన్సీతో విచారణ జరిపించాల్సిన అవసరం ఉందా లేదా అని చూడాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది.
పథకం విచారణలో, ఐసిసిడబ్ల్యు ద్వారా వచ్చిన నిధులను రాష్ట్ర కౌన్సిల్‌లకు పంపిణీ చేసే విధానంలో అనేక అవకతవకలు జరిగినట్లు తేలింది.
శిశు సదన్‌ల సంఖ్య, అందులో చేరిన పిల్లల సంఖ్యకు సంబంధించి క్షేత్రస్థాయి పరిస్థితి తెలుసుకోకుండా నిధులు పంపిణీ చేశారని, అదనంగా నిధులు కావాలని డిమాండ్ చేశారన్నారు.
విశేషమేమిటంటే, కేంద్ర ప్రభుత్వ ఈ పథకం 2016 వరకు అమల్లో ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ (ICCW) ప్రకారం, 2015-16లో దేశవ్యాప్తంగా 5,029 శిశు సదన్‌లు పనిచేస్తున్నాయి.