Thu. Dec 7th, 2023

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 21,2023: నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సీబీఎస్సీ నేషనల్ ఏరోబిక్స్ ఛాంపియన్‌షిప్ 2023 వేడుక ఘనంగా జరిగింది.

2023, అక్టోబరు 20న జరిగిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 200 పాఠశాలల నుంచి దాదాపు 800 మంది ప్రతిభావంతులైన యువ ఏరోబిక్స్ పాల్గొన్నారు.

డీపీఎస్ సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ గౌరి కార్యక్రమంలో పాల్గొనేవారికి, అతిథులకు,హాజరైన వారికి సాదర స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ నైసీ జోసెఫ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొరియోగ్రఫీ, యోగా,ఫిట్‌నెస్ ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన జోసెఫ్ విద్యార్థులకు విలువైన విషయాలు తెలిపారు.

డీపీఎస్, పల్లవి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్‌ మల్కా కొమరయ్య విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడంతో వేడుక మరింత ప్రతిష్టాత్మకంగా మారింది.

అలాగే ఈ విద్యాసంస్థల సీఓఓ మల్కా యశస్వి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల ప్రాముఖ్యాన్ని తెలియజేశారు.

 స్కూల్ సీనియర్ ప్రిన్సిపల్, జాతీయ అవార్డు గ్రహీత ఎస్. సునీతారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులంతా జీవితంలో ఎదగాలని, వాళ్లు అన్నిరంగాల్లోనూ రాణించాలని ఆకాక్షించారు.

సీబీఎస్సీ అబ్జర్వర్ సంతోష్ దేశ్‌ముఖ్, టెక్నికల్ డెలిగేట్ సంతోష్ ఖైర్నార్ ఈ ఈవెంట్‌కు హాజరై ఛాంపియన్‌షిప్ సజావుగా జరిగేలా చూశారు.

వారి నైపుణ్యం, మార్గదర్శకత్వం పాల్గొనేవారికి ,నిర్వాహకులకు అమూల్యమైనదిగా స్కూల్ యాజమాన్యం తెలిపింది.

 సంతోష్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ.. పీఈ డిపార్ట్ మెంట్ ఇంత మంచి కార్యక్రమానికి నాంది పలికి, విజయవంతంగా కొనసాగించడంలో ముఖ్య పాత్ర పోషించిన శ్రీ మన్మోహన్ ని ప్రశంసించారు.

కార్యక్రమంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంపియన్‌షిప్ ఫలితాల ప్రకటనతో ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. విజేతలకు పతకాలు, ట్రోఫీలను అందించారు. దేశభక్తి తో విద్యార్థులంతా ఏకమై ప్రదర్శించిన జాతీయ గీతంతో కార్యక్రమం ముగిసింది.