365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, నవంబర్ 21,2025: దేశంలో 16.7 కోట్ల డీమ్యాట్ ఖాతాలకు కాపలాదారైన సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్ (సీడీఎస్ఎల్)… ఇన్వెస్టర్లలో ఆర్థిక అవగాహన, బాధ్యతాయుత పెట్టుబడులను పెంచేందుకు దేశవ్యాప్తంగా విద్యార్థుల కోసం తొలిసారిగా భారీ ఐడియాథాన్‌కి తెరలేపింది.
‘రీఇమేజిన్ ఐడియాథాన్-2025’ పేరుతో నిర్వ్వహించే ఈ పోటీలో గెలిచిన బెస్ట్ ఐడియాకు ₹5 లక్షలు, రెండో స్థానానికి ₹3 లక్షలు, మూడో స్థానానికి ₹2 లక్షలు, నాలుగు–ఐదో స్థానాలకు చెరి ₹75 వేలు… మొత్తం ₹11.5 లక్షల బహుమతులు ప్రకటించింది.

గేమిఫికేషన్, ఏఐ, సోషల్ మీడియా, రీజనల్ లాంగ్వేజెస్, బిహేవియరల్ నడ్జెస్ లేదా కమ్యూనిటీ మోడల్స్ ఏదైనా ఉపయోగించుకోవచ్చు. కానీ ఐడియాలో మూడు మూల స్తంభాలు తప్పనిసరి – సాధికారత, సమ్మిళితత్వం, విశ్వసనీయత.
సీడీఎస్ఎల్ ఎండీ & సీఈవో నేహల్ వోరా మాట్లాడుతూ…
“అవగాహన ఉన్న ఇన్వెస్టర్ మాత్రమే సురక్షిత ఇన్వెస్టర్. భారత్‌లోని ప్రతి యువకుడూ ఈ ధనసృష్టి ప్రక్రియలో భాగస్వామి అవ్వాలి.
ఆ లక్ష్యంతోనే ఈ ఐడియాథాన్. దేశ భవిష్యత్తును రూపొందించే ఐడియాలు మీ నుంచి ఆశిస్తున్నాం” అని పిలుపునిచ్చారు.

ఎవరు పాల్గొనవచ్చు?
ఒకే కాలేజీ/యూనివర్శిటీ నుంచి గరిష్ఠంగా 4 మంది విద్యార్థులు + 1 మెంటార్ టీమ్‌గా రిజిస్టర్ చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్లు నవంబర్ 19 నుంచి ప్రారంభం.
పూర్తి వివరాలు, ప్రాబ్లెమ్ స్టేట్‌మెంట్, టైమ్‌లైన్ కోసం → https://ideathon.cdslindia.com
సెబీ, ఆర్‌బీఐలాంటి నియంత్రణ సంస్థల చొరవలకు అనుగుణంగా… ఆత్మనిర్భర భారత్ కోసం ఆర్థిక అవగాహన విప్లవానికి సీడీఎస్ఎల్ ఇదే తొలి అడుగు!
