365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,ముంబై,మార్చి 21, 2025:భారతదేశంలో ప్రముఖ టైర్ తయారీ సంస్థ సియట్ (CEAT) మరో కీలక ముందడుగు వేసింది. లగ్జరీ, హై-పెర్ఫార్మెన్స్ వాహనాల కోసం రూపొందించిన తమ తాజా స్పోర్ట్‌డ్రైవ్ టైర్ శ్రేణిలో ప్రపంచ స్థాయి టెక్నాలజీలను ప్రవేశపెట్టింది.

అత్యాధునిక రన్-ఫ్లాట్ టైర్లు, 300 KMPHకి పైగా వేగాన్ని తట్టుకునే CALM టెక్నాలజీ గల 21 అంగుళాల ZR రేటెడ్ టైర్లు విడుదల చేస్తూ, వీటిని తయారు చేసిన తొలి భారతీయ కంపెనీగా రికార్డు సృష్టించింది.

సియట్ కొత్త టైర్లు అత్యుత్తమ పనితీరు, భద్రత ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించాయి. ఇవి జర్మనీలోని అత్యున్నత ఆటోమోటివ్ ల్యాబ్‌లలో కఠినమైన పరీక్షలు ఎదుర్కొన్నాయి. ఈ సందర్భంగా సియట్ ఎండీ, సీఈవో ఆర్ణబ్ బెనర్జీ మాట్లాడుతూ,”ZR-రేటెడ్ టైర్లు, CALM టెక్నాలజీ, రన్-ఫ్లాట్ టైర్లతో సియట్ ప్రీమియం టైర్ విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.

Read this also…CEAT Introduces Global Tyre Technologies in India with SportDrive Range

Read this also…Sur Mahal – The Patiala Baithaks: A Regal Revival of Patiala’s Musical Heritage

హై-ఎండ్ వాహన యజమానులకు మెరుగైన భద్రత, సౌకర్యాన్ని అందించడమే మా లక్ష్యం. రన్-ఫ్లాట్ టైర్లను ప్రవేశపెట్టిన తొలి భారతీయ టైర్ సంస్థగా నిలవడం గర్వకారణం”, అని పేర్కొన్నారు.

సియట్ స్పోర్ట్‌డ్రైవ్ సిరీస్ టైర్లు ఏప్రిల్ నుంచి ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, కోల్‌కతా, పుణె, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, గువాహటి, అహ్మదాబాద్ వంటి ప్రధాన నగరాల్లో అందుబాటులోకి రానున్నాయి.
🔹 రన్-ఫ్లాట్ టైర్లు – ₹15,000 నుంచి ₹20,000
🔹 ZR రేటెడ్ 21″ టైర్లు (CALM టెక్నాలజీతో) – ₹25,000 నుంచి ₹30,000

CEAT స్పోర్ట్‌డ్రైవ్ టైర్ల ప్రత్యేకతలు

ఇది కూడా చదవండి… ఏఐ పరివర్తనకు ఊపందిస్తూ ఎయిర్ న్యూజిల్యాండ్‌తో భాగస్వామ్యంతో టీసీఎస్”

ZR-రేటెడ్ 21″ టైర్లు – 300 KMPHకి పైగా వేగాలను తట్టుకునే సామర్థ్యం. అధిక వేగంలోనూ అద్భుతమైన గ్రీప్, కంట్రోల్, స్టెబిలిటీ.
CALM టెక్నాలజీ – ఇన్-క్యాబిన్ నాయిస్ గణనీయంగా తగ్గింపు. అధిక శబ్దాన్ని అదుపు చేసి, నిశ్శబ్దమైన డ్రైవింగ్ అనుభవం.
రన్-ఫ్లాట్ టైర్లు – పంక్చర్ అయినప్పటికీ, వాహనం నిర్దేశిత వేగంతో ముందుకు సాగేలా రూపొందిన సాంకేతికత. హై-ఎండ్ సెడాన్, ఎస్‌యూవీలకు అదనపు భద్రత.

సియట్ ఆధునిక టైర్ ఇంజినీరింగ్‌తో భారతీయ మార్కెట్‌లో మరో మైలురాయిని నమోదు చేసింది. దేశీయంగా ప్రీమియం సెగ్మెంట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది.