365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు 21,2021: నోవోటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ తమ ఫుడ్ ఎక్సేంజ్ రెస్టారెంట్ వద్ద 22ఆగస్టు 2021 నాడు ఓనమ్ ప్రత్యేక బ్రంచ్‌ను నిర్వహించబోతుంది. వ్యవసాయ పండుగను వేడుక చేస్తూ కేరళ వంటకాలలోని అద్భుతమైన రుచులను ప్రత్యేక బఫె రూపంలో ప్రదర్శించబోతుంది. ఈ ప్రాంగణాన్ని పూలతో అలంకరించడంతో పాటుగా సంప్రదాయ పూకాలం (పూలతో చేసిన రంగవల్లులు)తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. సంప్రదాయ ఓనమ్ సద్య(విందు)లో 20కు పైగా డిషెస్ ఉన్నాయి. వీటిలో ప్రత్యేకమైన రుచులను అందించే పాలడప్రధమన్ , చుక్కువేళ్లం వంటివి ఉంటాయి.
ఈ బ్రంచ్‌ను ఫుడ్ ఎక్సేంజ్ (ఇండోర్స్ ,ఆల్‌ఫ్రెస్కో)వద్ద నిర్వహించనున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఆర్గానిక్ పదార్థాలతో తయారుచేసిన ఆహారాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించవచ్చు. సంప్రదాయ క్యుసిన్‌తో పాటుగా ఈ బఫెలో ఆసియన్, ఇండియన్, పాశ్చాత్య రుచులు సైతం అందుబాటులో ఉంటాయి. వీటితో పాటుగా టెప్పాయన్కీ ఐస్‌క్రీమ్ లైవ్ కౌంటర్ , వినూత్నమైన ఎగ్‌స్టేషన్ తో పాటుగా చాట్ కౌంటర్లు కూడా ఉంటాయి. నోవోటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ జనరల్ మేనేజర్ మనీష్ దయ్యా మాట్లాడుతూ ‘‘నోవోటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఓనమ్ పండుగను వేడుక చేస్తుండటం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన బఫెతో విభిన్న రకాల ఓనమ్ వంటకాలను ఇక్కడ రుచి చూడవచ్చు.
వీటిని పూర్తి సంప్రదాయ రీతిలో తయారుచేస్తున్నాం. మేము అమిత జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలన్నీ అనుసరిస్తున్నాం. నోవోటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ ఆల్ సేఫ్ లేబల్డ్ ప్రోపర్టీ. ఇది అత్యున్నత ప్రమాణాలతో కూడిన శుభ్రత, భద్రతను మా అతిథులతో పాటుగా సిబ్బందికి అందిస్తుంది. బ్యూరో వెరిటాస్ ఈప్రమాణాలను అభివృద్ధి చేయడంతో పాటుగా ధృవీకరించింది. ఎన్‌హెచ్‌సీసీ వద్ద మేము మా కమ్యూనిటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాము, భవిష్యత్ లో కూడా దానినికొనసాగిస్తూమద్దతునందించనున్నాము’’ అని అన్నారు.