365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూలై 31, 2025: అత్యంత పవిత్రమైన వరమహాలక్ష్మి పండుగ సమీపించుకొనే సమయంలో, కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ తమ కొత్త పండుగ కలెక్షన్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త కలెక్షన్లో అందంగా తీర్చిదిద్దిన టెంపుల్ జ్యువెలరీ, 92.5 స్వచ్ఛమైన వెండి ఆభరణాలు యాంటిక్ ఫినిష్‌లో ప్రత్యేకంగా విడుదలయ్యాయి.
ఈ కలెక్షన్ సంప్రదాయాన్ని సమకాలీన శైలితో మిళితం చేస్తూ, దక్షిణ భారతీయ వారసత్వంలోని ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కలెక్షన్లో లక్ష్మీదేవి ప్రతిరూపాలు, ఆలయ నిర్మాణ శైలుల వైభవం స్పష్టంగా కనిపిస్తాయి.
ఈ పండుగ సమయంలో దక్షిణ భారతదేశంలో మహిళలు సంపద, ఆరోగ్యం కోసం ఆరాధనలు చేస్తారు. కుషల్స్ తాజా కలెక్షన్ మహిళలకు సాంప్రదాయ ఆచారాలను గౌరవిస్తూ, తగినంత వైవిధ్యంతో ధరించదగిన ఆభరణాలను అందిస్తుంది. ఈ కలెక్షన్ ప్రచార చిత్రాల్లో ప్రసిద్ధ నటి ఆషికా రంగనాథ్ చక్కదనంతో ఆకట్టుకుంటూ, ఆభరణాల వైభవాన్ని బహిర్గతం చేస్తున్నారు.
కుషల్స్ కలెక్షన్లో ఆలయ శిల్పాలు, హంసలు, ఏనుగులు, గంటలు, కమలంపై కూర్చున్న లక్ష్మీదేవి నమూనాలు ముఖ్యంగా ఉంటాయి. ఈ శుభ చిహ్నాలు నెక్లెస్ సెట్లు, జుమ్కాలు, గాజులు, వడ్డాణములు, అరవంకీలు వంటి విస్తృత శ్రేణి ఆభరణాల్లో కనిపిస్తాయి. ఈ ఆభరణాలు భక్తి మరియు శైలిని ప్రతిబింబిస్తూ మహిళలకు సంపూర్ణ లుక్ అందిస్తాయి.
ఇది కూడా చదవండి…భారత్‌లో ఏఐ ప్రగతికి నైపుణ్యాలు బీజం: సర్వీస్‌నౌ నివేదిక..
కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ సహ వ్యవస్థాపకుడు శ్రీ మనీష్ గులేచా మాట్లాడుతూ, “వరమహాలక్ష్మి కలెక్షన్ ప్రతి మహిళలో దాచుకున్న బలం, దయ మరియు ఆధ్యాత్మికతకు నివాళి. యాంటిక్ గోల్డ్ ఫినిష్‌లో 92.5 స్వచ్ఛమైన వెండితో రూపొందించిన ఈ కలెక్షన్లో ఆధ్యాత్మిక చిత్తరువులు, సంప్రదాయ,ఆధునిక డిజైన్ల మేళవింపు స్పష్టంగా కనిపిస్తుంది. నటి ఆషికా రంగనాథ్‌తో కలిసి పనిచేయడం మాకు సంతోషాన్ని ఇస్తోంది. ఆమె సౌందర్యం,మూలాలు ఈ పండుగ కలెక్షన్ స్ఫూర్తిని అందంగా ప్రతిబింబిస్తున్నాయి” అని చెప్పారు.

నటి ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ, “ఈ కలెక్షన్ ధరించడం నా మూలాలకెంతో దగ్గరైన అనుభూతిని ఇచ్చింది. ఇది కేవలం ఆభరణాలు మాత్రమే కాకుండా, ప్రతి స్త్రీలోని అద్భుతమైన స్త్రీత్వ వేడుకగా ఉంటుంది. కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ సంప్రదాయాన్ని ఆధునిక శైలితో మేళవించి, ప్రతి స్త్రీని ప్రత్యేకంగా అనిపించేలా చేస్తోంది” అని పేర్కొన్నారు.
వరమహాలక్ష్మి పండుగలో ధరించదగిన ఆభరణాలు కావాలంటే, లేదా బహుమతులుగా ఇవ్వాలంటే ఈ కలెక్షన్ అందుబాటులో ఉంది. ప్రతి ఆభరణం ప్రతి స్త్రీలోని అంతర్ముఖీ దివ్యత్వానికి, బలానికి, అందానికి ఆరాధనగా ఉంటుంది.
ఈ కలెక్షన్ ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూర్, విజయవాడ సహా 38+ నగరాల్లో 100+ కుషల్స్ స్టోర్లలో,ఆన్లైన్లో kushals.com, కుషల్స్ మొబైల్ యాప్ ద్వారా అందుబాటులో ఉంది.
దివ్యమైన ఆభరణాలతో, సంప్రదాయపు ఆధ్యాత్మిక వేడుకలకు సరిపోయే ఈ వరమహాలక్ష్మి కలెక్షన్ కుషల్స్లో మాత్రమే లభిస్తుంది.