365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,ఢిల్లీ, ఏప్రిల్15,2023:ఫేక్ న్యూస్ ను నియంత్రించేందుకు కేంద్ర సర్కారు సిద్ధమైంది. తప్పుదారిపట్టించే వార్తలపై కేంద్రం దృష్టి సారించింది. అందులో భాగంగా పలు చర్యలు చేపట్టేందుకు ముందుకొచ్చింది.
ప్రభుత్వం నియమించిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్.. తప్పుడు సమాచారాన్ని తొలగించనుంది. ప్రభుత్వం నియమించిన ఫ్యాక్ట్-చెకర్స్ ద్వారా తప్పుడు లేదా తప్పుదారి పట్టించే ఏదైనా సమాచారాన్ని Google, Facebook ,Twitter వంటి కంపెనీలు ఆయా వార్తలను తీసివేయవలసి ఉంటుంది.

సోషల్ మీడియాలో వచ్చే వార్తలను తనిఖీ చేయడానికి భారత ప్రభుత్వం ప్రతిపాదించిన ఐటీ యాక్ట్ యూనిట్ జర్నలిజాన్ని సెన్సార్ చేయడం గురించి కాదని, మీడియాపై ఎలాంటి ప్రభావం చూపదని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారం అన్నారు.
ప్రభుత్వం నియమించిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్..ద్వారా జర్నలిజాన్ని సెన్సార్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారనడంలో వాస్తవం లేదన్నారు. ప్రభుత్వం నియమించిన ఫ్యాక్ట్-చెకర్స్ ద్వారా తప్పుడు లేదా తప్పుదారి పట్టించే ఏదైనా సమాచారాన్ని Google, Facebook అండ్ Twitter వంటి కంపెనీలు తీసివేయవలసి ఉంటుంది. గత వారం, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఈ చర్యను క్రూరమైనదని,సెన్సార్‌షిప్‌కు సమానమని పేర్కొంది.