Fri. Nov 15th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 19,2024:ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్‌లు (పీసీలు) ,టాబ్లెట్‌ల దిగుమతిని కేంద్ర ప్రభుత్వం పరిమితం చేయవచ్చు. దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు యాపిల్ వంటి కంపెనీలను ప్రోత్సహించడంలో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

భారతదేశంలో ఐటీ పరిశ్రమ విలువ 800 కోట్ల నుంచి 1000 కోట్ల మధ్య ఉంది. దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన భారతదేశ ఐటీ హార్డ్‌వేర్ మార్కెట్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత నియంత్రణ కారణంగా పెద్ద కుదుపును ఎదుర్కొంటుంది.

గతేడాది కూడా ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కానీ అమెరికా నుంచి బడా కంపెనీలు, లాబీల ఒత్తిడి కారణంగా నిర్ణయం మార్చుకున్నారు. వచ్చే ఏడాది నుంచి ఆంక్షలు తెస్తామని కేంద్ర ప్రభుత్వం కంపెనీలను హెచ్చరించింది.

కొత్త ఆదేశాలకు అనుగుణంగా కంపెనీలకు తగిన సమయం ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలుపుతున్నాయి. ల్యాప్‌టాప్ దిగుమతిదారులు ఆటోమేటెడ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తర్వాత ఎన్ని పరికరాలనైనా తీసుకురావచ్చు.

ఈ రంగంలో HP, Dell, Apple, Lenovo ,Samsung వంటి కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ప్రస్తుతం భారతదేశం ల్యాప్‌టాప్,కంప్యూటర్ అవసరాలలో మూడింట రెండు వంతులు చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి.

కొత్త చర్య దిగుమతులను పూర్తిగా ఆపదు. దిగుమతి చేసుకోగల పరికరాల సంఖ్య పరిమితం చేయనుందని నివేదించబడింది.

error: Content is protected !!