chaganti_CmJagan365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి,ఫిబ్రవరి16,2023: ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని కలిశారు.

ఇటీవలే టీటీడీ ధార్మిక సలహాదారుగా నియమితులైన చాగంటి కోటేశ్వరరావు ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.

chaganti_CmJagan365

ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరావుని సత్కరించి శ్రీవేంకటేశ్వరస్వామి వారి ప్రతిమ అందజేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. ముఖ్యమంత్రిని చాగంటి తోపాటు శాంతా బయోటెక్నిక్స్‌ లిమిటెడ్‌ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ డా. కే.ఐ. వరప్రసాద్‌ రెడ్డి కూడా కలిశారు.

ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం సీఎం నివాసం వద్ద ఉన్న గోశాలను చాగంటి కోటేశ్వరరావు, కే.ఐ. వరప్రసాద్‌ రెడ్డిలు సందర్శించారు. గోశాలను అద్భుతంగా తీర్చిదిద్దారని చాగంటి కోటేశ్వరరావు ఈసందర్భంగా ప్రశంసించారు.