365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుపతి,13 నవంబర్, 2021:తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీయాగం) శనివారం ప్రారంభమైంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా నవంబరు 21వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు చండీయాగం జరుగనుంది.
ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో ఉదయం పూజ, నిత్యహోమం, చండీహోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం హోమం, చండీపారాయణం, సహస్రనామార్చన, విశేష దీపారాధన నిర్వహిస్తారు.