Fri. Nov 8th, 2024

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 1,2024 :జూన్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందడం, రెన్యూవల్ చేసుకునే ప్రక్రియకు సంబంధించిన ఫీజులను కేంద్రం సవరించింది. పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ లేదా లెర్నింగ్ లైసెన్స్ పొందేందుకు లేదా రెండింటినీ పునరుద్ధరించుకోవడానికి రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల ప్రకారం, ప్రజలు RTO బదులుగా ప్రైవేట్ శిక్షణా కేంద్రాలలో డ్రైవింగ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది.

డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన ఈ నియమాలు ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా మారుతాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారం మీపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకోండి. డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన కొత్త నిబంధనలు జూన్ 1, 2024 నుండి అమలులోకి వచ్చాయి.

శనివారం అంటే జూన్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం అనేక కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. కొత్త నిబంధనలతో డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) పొందే ప్రక్రియ సులభతరం కానుంది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఇటీవలే డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియను సులభతరం చేయడానికి, మెరుగైన శిక్షణ పొందిన డ్రైవర్లను ప్రోత్సహించడానికి అక్రమాలను తగ్గించడానికి మార్పులను ప్రకటించింది.

పొడవైన లైన్ల నుంచి ఉపశమనం..
అమలులో ఉన్న అతిపెద్ద మార్పులలో ఒకటి ఏమిటంటే..? డ్రైవింగ్ పరీక్ష కోసం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న సమీప ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) వద్ద క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు.

డ్రైవింగ్ పరీక్షలో మార్పులు..

కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల ప్రకారం, ప్రజలు RTO బదులుగా ప్రైవేట్ శిక్షణా కేంద్రాలలో డ్రైవింగ్ పరీక్షను ఇవ్వడానికి ఎంపికను పొందుతారు. అయితే ఈ శిక్షణా కేంద్రాలు డ్రైవింగ్ లైసెన్సుల జారీకి పరీక్ష నిర్వహించాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది.

ఈ కేంద్రాలు డ్రైవింగ్ పరీక్షను పూర్తి చేసిన తర్వాత విజయవంతమైన దరఖాస్తుదారులకు సర్టిఫికేట్లను జారీ చేస్తాయి. ఈ సర్టిఫికేట్లను ప్రభుత్వ RTO ల ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫీజులో కూడా సవరణ..

జూన్ 1వ తేదీ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు, రెన్యూవల్ చేసుకునే ప్రక్రియకు సంబంధించిన ఫీజులను కూడా కేంద్రం సవరించింది. పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ లేదా లెర్నింగ్ లైసెన్స్ పొందేందుకు లేదా రెండింటినీ పునరుద్ధరించుకోవడానికి రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు రుసుము ఒక్కో దరఖాస్తుకు రూ.1,000. సౌలభ్యం కోసం, ఈ లైసెన్స్‌లను పొందే ప్రక్రియ ఇప్పుడు పూర్తిగా డిజిటల్‌గా ఉంటుంది.

జరిమానా పెరిగింది..

చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసేవారికి విధించే జరిమానాలో సవరణలను కూడా కేంద్రం ఆమోదించింది. జూన్ 1 నుంచి ఈ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులు రూ.2000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మీ కారుపై చలాన్ ఎంత? ఈ పద్ధతుల ద్వారా ఆన్‌లైన్‌లో తనిఖీ చేయండి.

మైనర్ డ్రైవింగ్‌లో పట్టుబడితే, జరిమానా మరింత ఎక్కువగా ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం రూ.25,000 జరిమానా విధించడంతోపాటు తల్లిదండ్రులు, వాహన యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. అలాంటి సందర్భాలలో, వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా రద్దు చేయనున్నారు.

ఇది కూడా చదవండి : అంటార్కిటికాలో మైత్రి-II పరిశోధనా కేంద్రం ఏర్పాటు

Also read:Tata Capital Healthcare Fund II invests upto $20 million in Orbicular Pharmaceutical Technologies

ఇది కూడా చదవండి :మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ” పిల్లల జీవితానికే సెగ పెట్టే పొగాకు”

Also read: Orient Electric appoints Ravindra Singh Negi as Managing Director and CEO

ఇది కూడా చదవండి : ఓపెన్ఏఐ, గూగుల్‌ను అధిగమించి ప్రపంచంలోనే నంబర్ 1గా నిల్చిన భారతదేశపు ఏఐ స్టార్టప్ జివి (Jivi)

Also read:  Indian AI Startup Jivi Emerges as World’s Number 1, Beating OpenAI and Google

Also read: IDFC FIRST Bank to raise Rs 3,200 cr via preferential issue

Also read: ICICI Lombard and Capital Small Finance Bank forge Corporate Agency Alliance

ఇది కూడా చదవండి : వి (Vi) అంటోంది ‘లెట్స్ నెట్‌ఫ్లిక్స్’

error: Content is protected !!