365తెలుగుడాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, జనవరి 4,2023: కొత్త సంవత్సరం 2023లో కొత్త వాహనాలధరలు భారీగా పెరగనున్నాయి. ఎంజీ మోటార్, మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్, హోండా, టాటా మోటార్స్, రెనాల్ట్, ఆడి , మెర్సిడెస్ బెంజ్ సహా ప్రధాన ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి.
దేశంలోని ప్రముఖ కంపెనీ టాటా మోటార్స్ తమ వాణిజ్య వాహనాల ధరలను జనవరి 2, 2023 నుంచి పెంచనున్నట్టు తెలిపింది. హోండా కూడా తమ వాహనాల ధరలను రూ.30,000 వరకు పెంచనున్నట్లు ప్రకటించింది.
అటువంటి పరిస్థితిలో మీరు కొత్త సంవత్సరంలో కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, అది మీకు ప్రస్తుతం ఉన్నదాని కంటే ఖరీదైనదిగా మారనుంది.
ఇ-ఇన్‌వాయిస్‌కి సంబంధించిన జిఎస్‌టి నిబంధనలు కూడా మారుతాయి. కొత్త సంవత్సరంలో జీఎస్టీ ఇ-ఇన్‌వాయిసింగ్ ,ఎలక్ట్రానిక్ బిల్లుకు సంబంధిం చిన నియమాలలో కూడా ముఖ్యమైన మార్పులు జరగనున్నాయి.
జిఎస్‌టి ఇ-ఇన్‌వాయిస్‌కు సంబంధించిన థ్రెషోల్డ్ పరిమితిని ప్రభుత్వం రూ.20 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గించింది. జీఎస్టీ నియమాలలో ఈ మార్పులు 2023 జనవరి 1వ తేదీ నుంచి వర్తిస్తాయి.
ఈ కొత్త రూల్స్ అమలులోకి వస్తే ఐదు కోట్ల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారులు ఎలక్ట్రానిక్ బిల్లులను రూపొందించాల్సి ఉంటుంది.