365తెలుగుడాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్,ఆగస్ట్ 3, 2025: ప్రస్తుతం చాలామంది తమ వ్యక్తిగత ప్రశ్నలకు, వ్యాపార విషయాలకు, ఆరోగ్య సంబంధిత సందేహాలకు సైతం ChatGPTని ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ ప్రైవేట్ చాట్‌లు గూగుల్‌లో కనిపించేలా మారుతున్నాయంటే మీరు షాక్‌ అవుతారు.

ఫాస్ట్ కంపెనీ ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం, ChatGPTలోని ‘చాట్ షేర్’ ఫీచర్ వల్ల ఈ లీకులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ సంభాషణలను పబ్లిక్ లింక్‌లుగా మార్చే అవకాశం ఉంది. అయితే ఈ లింకులు గూగుల్‌లో ఇండెక్స్ అయ్యే పరిస్థితి తలెత్తింది.

గూగుల్‌లో పబ్లిక్‌గా కనిపిస్తున్న ప్రైవేట్ చాట్‌లు..


‘site:chatgpt.com/share’ అనే కీవర్డ్‌తో గూగుల్‌లో శోధిస్తే, ఇప్పటికే 4,000కిపైగా పబ్లిక్ చాట్ లింకులు కనిపించాయంటూ నివేదిక చెబుతోంది. వీటిలో ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ సంబంధిత గోప్యతా విషయాలు, వ్యాపార ప్రణాళికలు, వ్యక్తిగత ఇమెయిల్ వివరాలు కూడా ఉన్నాయి.

ఎలా లీక్ అవుతున్నాయి..?

షేర్ బటన్ క్లిక్ చేస్తే పబ్లిక్ లింక్ క్రీయేట్ అవుతుంది. ఆ లింక్ Google వంటి సెర్చ్ ఇంజన్‌ల ద్వారా కనిపించవచ్చు..
చాట్‌లో మీరు మీ పేరు, కంపెనీ, ఇమెయిల్, లొకేషన్ వంటి వివరాలు టైప్ చేసినట్లయితే అవి బయటపడే అవకాశముంది

జాగ్రత్తలు..

మీ ప్రైవేట్ చాట్‌ను షేర్ చేయవద్దు..

షేర్ చేసిన లింక్‌ను గూగుల్‌లో ఇండెక్స్ కాకుండా robots.txt ద్వారా నిరోధించాలి, OpenAI ప్రైవసీ సెట్టింగ్స్‌ను సరిచూసుకోవాలి ఈ నేపథ్యంలో, మీరు ChatGPTను ఉపయోగిస్తున్న ప్పుడు… మీ గోప్యతను కాపాడుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అత్యంత అవసరం.