Sun. Dec 22nd, 2024
TTD_ CJI

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏలూరు,డిసెంబర్ 28, 2022: భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్ర చూడ్ బుధవారం రాత్రి కుటుంబ సమేతంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించు కున్నారు.

ఆలయం ఎదుట టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ జస్టిస్ చంద్ర చూడ్ కు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు సాంప్రదాయ బద్ధంగా స్వాగతించారు.

TTD_ CJI

ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం జస్టిస్ చంద్ర చూడ్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు శేషవస్త్రంతో సన్మానించి వేద ఆశీర్వాదం చేశారు.

అనంతరం ఆయనకు చైర్మన్,ఈవో స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీచంద్ర చూడ్ దంపతులు ఆలయంలో గోపూజలో పాల్గొన్నారు. గోవుకు, దూడకు పూజలు చేసి గ్రాసం తినిపించారు.

error: Content is protected !!