365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి 11 జూన్ 2021: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ శుక్రవారం సతీసమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, శాసన సభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెఈవో సదా భార్గవి, సివి ఎస్వో గోపీనాథ్ జెట్టి ఎన్వీ రమణ దంపతులకు స్వాగతం పలికారు. అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం వేద ఆశీర్వాదం ఇచ్చారు.

చైర్మన్, ఎమ్మెల్యే, జెఈవో ప్రధాన న్యాయమూర్తికి అమ్మవారి ప్రసాదం, చిత్ర పటం అందించారు. ఆలయ డిప్యూటీ ఈవో కస్తూరి బాయి తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
