Sat. Dec 21st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మర్చి 9,2024:ఆమె గురించి చిన్నతనం లోనే పిల్లలకు చెప్పడం వల్ల మహిళల సమస్యలు తగ్గటానికి అవకాశం ఉందని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్, జి.కృష్ణవేణీ అన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని * రామకృష్ణ మఠంలో యోగా నంద రఘుమహారాజు, నవభారత లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం బాలల సేవా విభాగంలో మహిళలు సమస్యలు పై అవగాహన సదస్సు నిర్వహించారు.*

ఈ కార్యక్రమంలో జి.కృష్ణవేణీ డా.హిప్నో పద్మా కమలాకర్, పిల్లలకు మహిళా ఫ్రీడం ఫైటర్స్ పుస్తకాలు , పండ్లు , పోషకాహారం అందజేశారు. వారు మాట్లాడుతూ మహిళల వెనకబాటు తనం ఇంకా తగ్గలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే మగ పిల్లలకే మహిళలు సమస్యలు తెలియజేశారు.

వారి ఆహారం, ఆరోగ్యం విషయాల్లో మగ పిల్లలకి అవగాహన ఉంటే బాగుంటుందని చెప్పారు. ఆమె ఆరోగ్యంగా ఉంటేనే అభివృద్ధి సాధించవచ్చన్నారు. 2030 నాటికి 342 కోట్ల కంటే ఎక్కువ మంది మహిళలు, బాలికలు అత్యంత పేదరికంలో జీవించే పరిస్థితి ఉంటుం దని ఐక్యరాజ్య సమితి నివేదికలు చెబుతున్నాయన్నారు.

దీన్ని రూపుమాపాలంటే మహిళల ఆరోగ్యం,సంక్షేమం,అభివృద్ధి, సామాజిక భద్రతకు మరిన్ని వనరులను సమకూర్చాలని తెలిపారు. మహిళలు, బాలికల ప్రతిభను గుర్తించి నైపుణ్యాలను మెరుగుప రచడంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంపొందించాలన్నారు.

వ్యవసాయంతో పాటు వ్యాపార, సాంకేతిక రంగాల్లోనూ వారి భాగస్వా మ్యాన్ని పెంచడం ఎంతో అవసరమన్నారు. అన్ని చోట్లా మహిళలు, బాలిక లకు అవసరమైన మౌళిక వసతులు కల్పించాలని కోరారు. సమానత్వం కోసం మహిళలు చేసే పోరాటం కేవలం స్త్రీవాదులు, సంస్థలకు సంబంధిం చినది కాదన్నారు.

మానవ హక్కుల గురించి శ్రద్ధ వహించే అందరి సమష్టి కృషికి సంబందించిందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ప్రతి ముగ్గురిలో ఒకరు శారీరకంగా, మానసికంగా సన్నిహితుల నుంచి హింసను ఎదుర్కొంటున్నారన్నారు.

యువతులలో 16 శాతం ఇటువంటి హింసను ఎదుర్కొన్నట్లు చెప్పారు .అమ్మాయికి ధైర్యమే అందం, ఆరోగ్యం మని తెలిపారు. ధైర్యం గా ఎన్నో సవాళ్ళను ఎదుర్కో వచ్చన్నారు.

హింసను ఎదుర్కొంటున్న మహిళల్లో బయటకువచ్చి తమ గోడు వెళ్ళ బోసుకుంటున్న వారు 40శాతమైనా ఉండటంలేదన్నారు. కుటుంబ సభ్యుల సహకారం కొరవ డటం, ఆర్ధిక పరిస్థితి అనుకూతించకపోవడం, న్యాయ వ్యవస్థల మీద పూర్తిస్థాయిలో విశ్వాసం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణాలని తెలిపారు.

ఆకాశంలో సగం అని సగర్వంగా చెప్పుకొంటున్న మహిళలకు వాస్త వంలో మాత్రం అడుగడుగునా అనేక సమస్యలు ఎదురవుతునే ఉన్నాయన్నారు . సమస్యలపట్ల అవగాహన పెంపొందిస్తూ ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో మహిళలను ప్రోత్సహించడానికి మహిళా దినోత్సవం మంచి సందర్భమని చెప్పారు .

ఈరోజు ఆడపిల్ల వద్దను కుంటే రేపటి సమాజం అమ్మ లేని అనాధ అవుతుందన్నారు. మహిళా సాధికారత అందరి సమిష్టి కృషిపై ఆధారపడి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ చార్జీ ఆరతి, జి.కృష్ణవేణీ, బాలబాలికలు పాల్గొన్నారు.

error: Content is protected !!