365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 30,2024: బిచ్చగాళ్లను, అనాధులను కాల్చే స్థలంలో పీఎం గా పనిచేసిన అంత పెద్ద గొప్ప మహానుభావుడిని కాల్చడం దురదృష్టకరం. ఇది భారత ప్రజలకు, దేశానికి అవమానం. బిజెపి ప్రభుత్వ పెద్దలు క్షమాపణలు చెప్పాలి.

భారత ఆర్థిక వ్యవస్థను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిన మన్మోహన్ సింగ్ కి ఢిల్లీలో అర్థ ఎకరా స్థలం ఇస్తే మీ అబ్బ సొత్తేమైనా పోతుందా?

మన్మోహన్ సింగ్ చనిపోతే, ఆయన్ని పొగుడుతూ “జెంటిల్మెన్ ప్రధాని” అని కీర్తిస్తూ, మీడియా చాలా గొప్పగా కథనాలు రాసింది.

పీఎంగా మన్మోహన్ సింగ్ చాలా మంచి పనులు చేశారు. కమ్యూనిస్టుల ఆలోచన ప్రకారం ఉపాధి హామీ చట్టం తెచ్చారు. అక్కడక్కడ ఉన్న మిడ్డే మిల్‌ను, 15 కోట్ల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టడం, ముఖ్యంగా రాజ్యాంగ సవరణ చేసి, ఓబీసీలకు 27% విద్య మరియు ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ కు, సోనియా గాంధీకి, మన్మోహన్ సింగ్‌కే దక్కింది.

మన్మోహన్ సింగ్ ఓబీసీ వర్గానికి చెందినవారు. చాలా మంది తెలీదు. ఆయన కులమేమిటో, ఆయనది గాజుల శెట్టి కులం (మన ప్రాంతంలో పండగలకి గాజులు వేసే దానికి వస్తుంటారు).

చాలా నిజాయితీగా పదేళ్లు ప్రధానమంత్రిగా ఈ దేశానికి సేవలందించారు.

మన్మోహన్ సింగ్ మాజీ ఆర్థిక మంత్రిగా, మాజీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడే, నువ్వు ఈ దేశానికి ప్రధాని అవుతావని నేను (చింతామోహన్) చెప్పాను.

“నేనెప్పుడూ పీఎం అవుతానా?” అని ఆయన నవ్వాడు! నన్ను “అమెరికా ఏజెంట్” అంటారని వాపోయారు.

2004లో యూపీఏ ప్రభుత్వ ఏర్పాటుకు కమ్యూనిస్టుల మద్దతు కీలకం. సోనియా గాంధీ కామ్రేడ్ హరికిషన్ సింగ్ సూర్జిత్ దగ్గరకు వెళ్లి, మద్దతు కోరారు.

ప్రధానిగా రెండు పేర్లను సూర్జిత్ కి తెలియజేశారు. ఒకటి ప్రణబ్ ముఖర్జీ, రెండోది మన్మోహన్ సింగ్ పేరు.

సోనియా గాంధీ కామ్రేడ్ హరికిషన్ సింగ్ సూర్జిత్ ని కలిసి వెళ్లాక, నేను (చింతామోహన్) ఆయనతో భేటీ అయ్యాను.

మన్మోహన్ సింగ్ ను ప్రధాని చేయవయ్యా? అని కోరాను. “మా వాళ్లు సీతారాం ఏచూరి, ప్రకాష్ కారత్ లు అమెరికా ఏజెంట్ మన్మోహన్ సింగ్ అంటుంటారని” అన్నాడు.

“మరి నువ్వు పీఎం అవుతావా?” అని నేను ప్రశ్నించాను. “నువ్వు కాలేనప్పుడు, పంజాబ్ నుంచి ఒక్క సిక్కు ప్రధాని ఎందుకు కాకూడదు?” అన్నాను.

అందుకు ఆయన “అతను (మన్మోహన్ సింగ్) ఎవరో నాకు తెలీదు” అన్నాడు. వెంటనే సూర్జిత్ బెడ్ రూమ్ నుంచి మన్మోహన్ సింగ్ కు ఫోన్ చేసి, రమ్మని పిలిచాను.

ఈ విషయం సోనియా గాంధీ కి తెలిస్తే బాగుండదన్నారు.

ఒంటరిగా తన సొంత 800 సిసి తెల్ల మారుతి కారు డ్రైవింగ్ చేసుకుంటూ, 8 తీన్ మార్ లైన్‌కు వచ్చి, కామ్రేడ్ సూర్జిత్ గారిని కలిశాడు.

తర్వాత కామ్రేడ్ జ్యోతిబాస్ గారిని, సూర్జిత్ సంప్రదించి, పోలిట్ బ్యూరోలో చర్చించి, మన్మోహన్ సింగ్ పేరును బలపరుస్తూ రాష్ట్రపతికి 72 మంది ఎంపీలతో సంతకాలు చేయించి, లేఖ ఇచ్చారు.

మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రిని చేయడంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సూర్జిత్ ను ఒప్పించడంలో నా పాత్ర వుంది.

అమిత్ షా, అంబేద్కర్ గురించి అవమానకరంగా మాట్లాడారు. సభ్యత, సంస్కారం, షాకు లేదు.

టీచర్లు ఐదేళ్ల క్రితం రిటైర్ అయిన టీచర్లు పెన్షన్ల కొరకు ఖజానా కార్యాలయం ముందు క్యూలో ఉన్నారు.

గోదావరి నీళ్ళను పెన్నా కి తీసుకొస్తాడంటా మన ముఖ్యమంత్రి. ఈ రోజు పేపర్లో చదివాను.

ఏపీలో దళితులెవరూ సంతోషంగా లేరు, కూటమి ప్రభుత్వం పైన. ప్రకాశం జిల్లా నుంచి కర్నూలు జిల్లా వరకు ఏ ఒక్కరు సంతోషంగా లేరు. (10 జిల్లాల్లో)

పోలవరం, అమరావతి కట్టిస్తామని భ్రమల్లో ఉన్నారు.

మా తిరుపతిలో జర్నలిస్టులు ఇండ్లు కట్టుకుని, లక్షాధికారులయ్యారు. సంతోషంగా ఉన్నారు.

విజయవాడలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 5 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలి.

విజయవాడ జర్నలిస్టులందరికీ నా మనవి. నా చేతికే మీ అప్లికేషన్లు ఇవ్వండి. నేనే స్వయంగా వెళ్లి కలుస్తాను. అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను.