Jagan's-birthday-celebratio

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ ,డిసెంబర్ 21,2022: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

” వైఎస్ జగన్‌కి 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు!! మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే” అని చిరంజీవి ట్వీట్ చేశారు.

ప్రధాని మోదీ సహా ఇతర రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సీఎం జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ట్విటర్‌లో సీఎం జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

జనసేన అధినేత పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ట్విటర్‌లో ‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు.

దేవుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు న్నాను’ అని పవన్‌కల్యాణ్‌ రాశారు.

మరోవైపు సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలను ఏపీ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు.

రక్తదాన శిబిరాలు, అన్నదానం, మొక్కలు నాటే కార్యక్రమం, కేక్‌ కట్‌తో వేడుకలు కొనసాగుతున్నాయి.