Sat. Dec 21st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 16,2024:వరద బాధితుల సహాయం కోసం అగ్రనటుడు,కేంద్ర మాజీ మంత్రి ‘మెగాస్టార్’ చిరంజీవి ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 లక్షల విరాళం అందించారు.

ఈ సందర్భంగా, చిరంజీవి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు.విరాళం చెక్కును అందజేశారు. అంతేకాక, తన కుమారుడు రామ్ చరణ్ తరపున మరో రూ. 50 లక్షల చెక్కును కూడా CMRFకి అందించారు.

చిరంజీవి గారి కుటుంబం సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి, వారి ఔదార్యాన్ని చాటుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి వెంట మంత్రి సీతక్క గారు కూడా ఉన్నారు.

error: Content is protected !!