Mon. Dec 23rd, 2024
Chiranjeevi helps mega fan..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగష్టు 16,2022:సినిమా హీరోల నటనకు కొంతమంది అభిమానులుగా మారుతుంటారు. మెగాస్టార్ చిరంజీవి విషయంలో అభిమానిగా కాదు.. వీరాభిమానులుగా మారి ఆయన నడిచే బాటలోనే పయనిస్తుంటారు.

Chiranjeevi helps mega fan..

ఈ అభిమాని కూడా అదేపని చేస్తూ మెగాస్టార్ ను తనకు వీరాభిమాని అయ్యేలా చేశారు. చిరంజీవి చేస్తున్నసేవా కార్యక్రమాలను చూసి ఆయన కూడా తనవంతుగా సేవ చేస్తున్నారు ఈ ఫ్యాన్.

తన అభిమానులు బాధల్లో ఉన్నారంటే అటువంటి వారిలో భరోసా నింపేందుకు ముందుంటారు చిరంజీవి. అభిమానులు చూపే ఆప్యాయతను ఆస్వాదిస్తూ.. తన ఫ్యాన్స్ కూ అదే స్థాయిలో వీరాభిమాని గా మారుతుంటారు మెగాస్టార్ చిరంజీవి..

ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే సాయం చేసేందుకు మెగాస్టార్‌ చిరంజీవి ఎప్పుడూ ముందే ఉంటారు. తోడబుట్టిన ‘అన్నయ్య’లా మారి ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటారు. చిన్న ఇబ్బంది వచ్చిన నేనున్నాను అంటూ భరోసా కల్పిస్తారు చిరంజీవి. ఇప్పుడేకాదు గతంలోనూ ఎంతోమంది అబిమానులకు సాయం చేసిన చిరంజీవి..

తాజాగా అనారోగ్యంతో బాధపడుతున్న తన అభిమానిని కలిసి అతనికి ఆత్మ స్థైర్యాన్ని నింపారు. కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి అభిమాని దొండపాటి చక్రధర్‌ క్యాన్సర్‌ తో బాధపడుతున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి.. వెంటనే ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వైద్యానికి అవసరమయ్యే ఖర్చు తానే భరిస్తూ ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో జాయిన్‌ చేయించారు.

అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభిమాని దొండపాటి చక్రధర్‌ ను పరామర్శించిన మెగాస్టార్ అతనికి ధైర్యం చెప్పారు. అలాగే అక్కడి వైద్యులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

Chiranjeevi helps mega fan..

అలాగే చక్రధర్ కు అండగా ఉంటామని ఆయన కుటుంబసభ్యలకు కూడా మెగాస్టార్ చిరంజీవి ఈసందర్భంగా అభయం ఇచ్చారు.

error: Content is protected !!