365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, డిసెంబర్ 12,2022: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనలు తమ మొదటి బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌లో పంచుకున్నారు.

SOURCE FROM TWITTER

హనుమంతుడి ఫోటోను ట్వీట్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి, “శ్రీ హనుమాన్ జీ ఆశీర్వాదంతో, ఉపాసన & రామ్ చరణ్ తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారని పంచుకోవడానికి మేము సంతోషిస్తున్నాము. ప్రేమ ,కృతజ్ఞతతో సురేఖ & చిరంజీవి కొణిదెలి, శోభన & అనిల్ కామినేని”అని టాగ్ చేశారు.

2012లో జూన్ 14వతేదీన హైదరాబాద్‌లో రామ్ చరణ్ ,ఉపాసన లు వివాహబంధంతో ఒక్కటయ్యారు. పదేళ్ల తర్వాత వీరిద్దరూ ఓ బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధమయ్యారు.