365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 28, 2025: ఈ ప్రదేశం నాకు ముందే తెలుసు, ఎందుకంటే నేను ఇక్కడి గురించి చాలా రోజుల ముందు తెలిసి వున్నాను. నేను ఇల్లు కట్టుకున్నప్పుడు రాందేవ్ గారు నాకు కొన్ని విదేశీ మొక్కలు ఇచ్చారు. విదేశాలకు వెళ్ళినప్పుడు, ఇలాంటి మొక్కలను తీసుకెళ్లితే బాగుండే అనిపించేది.
మా ఇంటి దగ్గర పెరిగిన మొక్కలను చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది.మన హైదరాబాద్‌లోనే ఇలాంటి మొక్కలను రాందేవ్ గారు తీసుకురావడం చాలా అభినందనీయం. రాందేవ్ గారు వ్యాపార వేత్తగా కాకుండా కళాకారుడిగా కనిపించారు.

ఇంత విలువైన భూమిని ఎవరైనా రియల్ ఎస్టేట్‌గా వాడుకోవచ్చు, కానీ రాందేవ్ గారు ప్రకృతి ప్రేమికులుగా ఇంత ప్రేమతో ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేశారు.ఈ ప్రదేశంలో నా సినిమా షూటింగ్ చేయాలనే ఆలోచన కూడా ఉన్నది.
ఇలాంటి ప్రదేశానికి ప్రభుత్వ సహకారం చాలా అవసరం.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ప్రదేశంలో ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి చాలా ఇష్టపడ్డారు. ఈ ప్రదేశం రాబోయే రోజుల్లో గొప్ప పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉంది. దేశం,రాష్ట్రం ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ పీరియం చాటుతుంది.