365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 12,2024: భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ పై భాస్కర్ యాదవ్ దాసరి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం చిట్టి పొట్టి. రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అన్న చెల్లెలి అనుబంధంతో నడిచే ఈ సినిమాలో భావోద్వేగాలు, తెలుగుదనం అనురాగాలు, ఆప్యాయతలు ఉంటాయి. మూడు తరాలలో చెల్లెలుగా, మేనత్తలుగా, బామ్మ గా … ఒక అడబిడ్డకి పుట్టింటి పైన ఉన్న ప్రేమ, మమకారం ను తెలిపే చిత్రం. ప్రతి ఇంట్లో ఉండే ఆడపిల్ల విలువ తెలియజేసే సినిమా ఇది.

చిట్టి పొట్టి టైటిల్ మోషన్ పోస్టర్ కు చక్కటి ఆదరణ లభించింది, ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని దర్శక నిర్మాత భాస్కర్ యాదవ్ దాసరి తెలిపారు.

నటీనటులు: రామ్ మిట్టకంటి , పవిత్ర, కస్వి, కాంతమ్మ, ఆచారి, హర్ష, సతీష్, రామకృష్ణ, సరళ

సాంకేతిక నిపుణులు:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత: భాస్కర్ యాదవ్ దాసరి
సంగీతం: శ్రీ వెంకట్
ఎడిటర్: బాలకృష్ణ బోయ
కెమెరా: మల్హర్బట్ జోషి
పిఆర్ఓ: లక్ష్మి నివాస్,దయ్యాల అశోక్
.

ఇది కూడా చదవండి: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఎలా మొదలైంది..

ఇది కూడా చదవండి: గంగా ఎంటర్టైన్మంట్స్ ‘శివం భజే’ ఫస్ట్ లుక్ విడుదల

Also read : ‘Shivam Bhaje’: First Look has Ashwin Babu showing his explosive rage!

ఇది కూడా చదవండి: ఓటు వేసిన వారికీ వండర్లా హైదరాబాద్ పార్క్ టిక్కెట్లపై 20% తగ్గింపు

Also read : Cast your vote and get 20% off on Wonderla Hyderabad Park tickets!

ఇది కూడా చదవండి: వేసవి శిబిరాన్ని ప్రారంభించిన స్కోడా ఇండియా

ఇది కూడా చదవండి: రూ.15వేల లోపు 5G స్మార్ట్‌ఫోన్స్..జాబితా..