Fri. Oct 11th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,బెంగళూరు, సెప్టెంబర్ 22, 2024 :నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ) లోని ప్రధాన అకడమిక్ బ్లాక్ ,సమగ్ర పునరాభివృద్ధి , విస్తరణ పనులకు సంబంధించి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ శంకుస్థాపన చేశారు. ఈ బ్లాక్‌ను జేఎస్‌డబ్ల్యూ అకడమిక్ బ్లాక్‌గా పేరుపెట్టనున్నారు, ఇది దేశంలోని న్యాయవిద్యను ప్రోత్సహించడంలో ఒక కీలక మైలురాయి.

ప్రతిపాదన ప్రకారం, ప్రస్తుత భవంతిని బహుళ అంతస్తుల నిర్మాణంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇందులో అధునాతనమైన లెక్చర్ థియేటర్లు, సెమినార్ గదులు, ఫాకల్టీ ఆఫీసులు ,సహకార పరిశోధన సదుపాయాలు ఉంటాయి. ఈ అప్‌గ్రేడ్ చేసిన మౌలిక సదుపాయాలు విద్యార్థులు,పరిశోధకులకు వేగంగా మారుతున్న న్యాయ పరిస్థితులను మెరుగైన అభ్యాస వాతావరణంలో అవగాహన చేసుకునేందుకు ఉపయోగకరంగా ఉంటాయి.

ఈ ప్రాజెక్ట్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ అందించిన గణనీయమైన గ్రాంట్ ద్వారా జరుగుతోంది, ఇది ఎన్ఎల్‌ఎస్‌ఐయూకి విద్యాపరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం.‘జేఎస్‌డబ్ల్యూ సెంటర్ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ లా’ని ఏర్పాటు చేయడానికి అవసరమైన నిధులను అందిస్తుంది.

ఈ సెంటర్, లీగల్ క్షేత్రంలో సాంకేతికతల పురోగతితో తలెత్తే సవాళ్లను అధిగమించడానికి, అందుబాటులో ఉన్న అవకాశాలను అందుకోవడానికి ఉద్దేశించింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ప్రైవసీ, ఆటోమేషన్ వంటి అంశాలను అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది.

ఈ కార్యక్రమంలో, భారత అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా, జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్ చైర్‌పర్సన్ శ్రీమతి సంగీత జిందాల్,జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ & జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్ మేనేజింగ్ డైరెక్టర్ పార్థ్ జిందాల్ వంటి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్ మాట్లాడుతూ, “విద్యకు పరివర్తనాత్మక శక్తి ఉందని మేము నమ్ముతున్నాం. అకడమిక్ బ్లాక్ అభివృద్ధి,జేఎస్‌డబ్ల్యూ సెంటర్ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ లా స్థాపన కేవలం మౌలిక సదుపాయాల గురించి మాత్రమే కాదు.

దాని ద్వారా వేగంగా మారుతున్న న్యాయ,సాంకేతిక రంగాలలో తదుపరి తరం న్యాయ ప్రొఫెషనల్స్‌ను సిద్ధం చేయడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఇది జాతి నిర్మాణంపై దీర్ఘకాలిక ప్రభావం చూపే కార్యక్రమాలకు మద్దతుగా నిలవాలన్న మా విజన్‌కు అనుగుణంగా ఉంది” అన్నారు.

జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్ చైర్‌పర్సన్ శ్రీమతి సంగీత జిందాల్ పేర్కొన్నట్లు, “ఎన్ఎల్‌ఎస్‌ఐయూ మౌలిక సదుపాయాలపై పెట్టుబడుల ముఖ్య లక్ష్యం, విద్యార్థులకు అకడమిక్ పరిజ్ఞానం మాత్రమే కాకుండా, సమాజంలో ఉండే సవాళ్లను ఎదుర్కొనేందుకు సాధికారత కల్పించడమే.

భవిష్యత్తులో న్యాయాన్ని తీర్చిదిద్దే న్యాయవాదులు కొత్త టెక్నాలజీలను ఉపయోగించేందుకు సిద్ధంగా ఉండాలని మేము ఆశిస్తున్నాం. జేఎస్‌డబ్ల్యూ అకడమిక్ బ్లాక్,సెంటర్ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ లా ఈ లక్ష్యం సాధించడంలో కీలకంగా ఉంటాయి.”

జేఎస్‌డబ్ల్యూ సిమెంట్,జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పార్థ్ జిందాల్ మాట్లాడుతూ, “న్యాయ రంగంలో సాంకేతికత అనేది కాంట్రాక్టుల విశ్లేషణకు ఏఐ ఆధారిత సాధనాలు,లిటిగేషన్‌లో ఆటోమేషన్ వంటి విధానాలను చాలా వేగంగా మార్చుతోంది.

ఈ సందర్భంలో, ఎన్ఎల్‌ఎస్‌ఐయూ ఈ ఆవిష్కరణలలో ముందువరుసలో ఉండేందుకు జేఎస్‌డబ్ల్యూ సెంటర్ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ లా తోడ్పాటు అందిస్తుంది. తద్వారా భవిష్యత్తు న్యాయ ప్రొఫెషనల్స్ ఈ సాంకేతికతలను వినియోగించుకోవడానికి , నియంత్రించడానికి సిద్ధంగా ఉంటారు” అన్నారు.

ఈ భాగస్వామ్యం ద్వారా, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్,ఎన్ఎల్‌ఎస్‌ఐయూ సంయుక్తంగా భారత్‌లో న్యాయవిద్య భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నాయి. న్యాయవిద్యను మరింత సమ్మిళితంగా, టెక్నాలజీ ఆధారితంగా,ప్రొఫెషన్‌లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ఇది సహాయపడుతుంది.

error: Content is protected !!