Sat. Sep 14th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,విజయవాడ,సెప్టెంబర్ 4,2024:వరద ప్రభావిత ప్రజలను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో విరివిగా విరాళాలు అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపు మేరకు అనేక మంది వ్యక్తులు, సంస్థలు విరాళాలు అందించేందుకు ముందుకు వస్తున్నారు.

ఈ సందర్భంగా బుధవారం విజయవాడ కలెక్టరేట్ వద్ద ముఖ్యమంత్రిని కలిసి పలువురు విరాళాలు అందించారు.

  1. బీఎస్ఆర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఎండీ బలుసు శ్రీనివాసరావు రూ.1 కోటి
  2. సినీ నిర్మాత అశ్వనీదత్ రూ.25 లక్షలు
  3. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రూ.25 లక్షలు (విజయవాడ)
  4. సిద్ధార్థ వాకర్స్ క్లబ్ రూ.5 లక్షలు (విజయవాడ)
  5. టీడీపీ మహిళా నాయకురాలు రాయపాటి శైలజ రూ.5 లక్షలు (గుంటూరు)
  6. డాక్టర్ ఐ.నలినీ ప్రసాద్ రూ.1 లక్ష (విజయవాడ)
  7. పొట్లూరి విజయ్ కుమార్ రూ.1 లక్ష (విజయవాడ)
  8. అల్లూరి అచ్యుతరామరాజు రూ.1 లక్ష (కైకలూరు)
  9. వల్లభనేని రవి రూ.1 లక్ష విరాళం అందించారు.

ఈ మేరకు సంబంధిత చెక్కులు, నగదును సీఎం చంద్రబాబు నాయుడును కలిసి అందజేశారు. విపత్కర పరిస్థితుల్లో బాధితుల పక్షాన నిలిచేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి తమవంతు సాయం అందించామని దాతలు పేర్కొన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో ముందుకొచ్చి తమ దాతృత్వాన్ని చాటుకొని విరాళాలు అందించినందుకు దాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపి అభినందించారు.

error: Content is protected !!