365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,సెప్టెంబర్ 27,2021: గులాబ్ తూఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏర్పడ్డ పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం సమీక్షించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశమున్నందున రాష్ట్రంలోని అన్నిపాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రేపు మంగళ వారం (28, 29)సెలవు ప్రకటిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి ఆదేశాలననుసరించి తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. అయితే, అత్యవసర శాఖలైన రెవిన్యూ, పోలీస్, ఫైర్ సర్వీసులు, మున్సిపల్, పంచాయతీ రాజ్, నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖలు విధి నిర్వహణలో ఉండాలని, భారీ వర్షాల వల్ల ఏవిధమైన ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చూడాలని సోమేశ్ కుమార్ కోరారు.21:0