365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,నవంబర్ 13,2023: బజార్‌ఘాట్ సమీపంలోని గోడౌన్‌లో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు.
ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. వారి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, వారు త్వరగా కోలుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.