365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్ ,ఏప్రిల్ 6,2021సంగారెడ్డి : కాళేశ్వర ప్రాజెక్టు ప్రస్థానంలో మంగళవారం మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాల్వలో పారుతున్న కాళేశ్వర జలాలను.. వర్గల్ మండలం అవుసులపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్ నుంచి హల్దీ కాల్వలోకి విడుదల చేశారు. సంగారెడ్డిజిల్లాలోని కొండపోచమ్మ ప్రాజెక్ట్ దగ్గర సీఎం కేసీఆర్ పూజలు నిర్వహించారు.
కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్‌కు నీరు విడుదల చేశారు. హల్దీ కాలువలోకి గోదావరి జలాలను కూడా విడుదల చేశారు. నీటి విడుదలతో ఆరు మండలాల్లోని 30 వేల మంది రైతులకు లబ్ది చేకూరనుంది. అంతేకాకుండా15 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది.
ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.