365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 21,2024: సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో సినీనటుడు అల్లూ అర్జున్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్టు ఆయన ఆరోపించారు.
ముఖ్యంగా, “ఓ సినీనటుడిని అరెస్టు చేస్తే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ బాధ్యతను తీసుకోలేదు. అల్లు అర్జున్‌కు అనుమతి ఇవ్వకుండానే రోడ్డు షో చేయడం వల్లే ప్రమాదం జరిగింది. అందుకే తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంది,” అని ఆయన అన్నారు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో కన్నబిడ్డను పట్టుకుని తల్లి చనిపోయింది. కొడుకుకు మాత్రం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కానీ, “బాలుడిని పరామర్శించడానికి ఎవరూ ముందుకు రాలేదు.
హీరోలు, హీరోయిన్లు తమ క్యూ పెట్టుకుని అల్లు అర్జున్ ని పరామర్శించడానికి వెళ్లారు, కానీ ఆ బాలుడిని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు,” అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
అల్లు అర్జున్ కాలు పోయిందా లేదా కన్ను పోయిందా..?అని కూడా ఆయన ప్రశ్నించారు, “ఎందుకు అతనిని పరామర్శించాలి? ఆస్పత్రిలో ఉన్న బాలుడిని ఎందుకు పట్టించుకోరు?” అని రేవంత్ ప్రశ్నించారు.
సంధ్య థియేటర్లో రోడ్డు షో నిర్వహించిన అల్లు అర్జున్.
తొక్కిసలాటలో తల్లి చనిపోయింది, కొడుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
సినీనటుడిని పరామర్శించిన హీరోలు, బాలుడిని పట్టించుకోలేదు.
రేవంత్ రెడ్డి ఆరోపణలు – అల్లు అర్జున్ బాధ్యత రాహిత్యం.